High Court: న్యాయమూర్తుల మీద నిందలు, ఫిర్యాదులు, మెమో, లాయర్ కు సరైన బుద్ది వచ్చింది!
న్యాయమూర్తులు అవినీతిపరులని, తన కేసు విచారణ వేరే బెంచ్ కు బదిలి చెయ్యాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఓ లాయర్ లేఖలు రాయడం కలకలం రేపింది.
బెంగళూరు/న్యూఢిల్లీ: ఓ న్యాయవాది ఆయన కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తుల మీద నిందలు వేశారు. తాను హైకోర్టులో లాయర్ అనే విషయం మరిచిపోయిన ఆ న్యాయవాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో జడ్జి మీద నిందలు వేశారు. న్యాయమూర్తులు అవినీతిపరులని, తన కేసు విచారణ వేరే బెంచ్ కు బదిలి చెయ్యాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖలు రాయడం కలకలం రేపింది.
ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు జడ్జిల మీద ఆరోపణలు చేసిన న్యాయవాదిని జైలుకు పంపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు కూడా వారి పార్టీ అధికారంలో ఉందని, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని కోర్టులు, న్యాయమూర్తుల మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సుప్రీం కోర్టుకు లేఖ రాసిన లాయర్
కర్ణాటకకు చెందిన కేఎస్, అనీల్ అనే న్యాయవాది (లాయర్) కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో జడ్జి మీద నిందలు వేశారు. న్యాయమూర్తులు అవినీతిపరులని, తన కేసు విచారణ ఏకపక్షంగా విచారణ జరుగుతోందని, అందు వలన తన కేసును వేరే బెంచ్ కు బదిలి చెయ్యాలని న్యాయవాది కేఎస్, ప్రకాష్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖలు రాయడం, మోమో ఇవ్వడం కలకలం రేపింది.

సుమోటో కేసుగా స్వీకరించిన హైకోర్టు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో జడ్జి మీద ఓ లాయర్ ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంప్రేరితం (సుమోటో కేసుగా) స్వీకరించిన కర్ణాటక హైకోర్టులోని డివిజన్ బెంచ్ పిటిషన్ విచారణ చేసింది. లాయర్ ప్రకాష్ ఉద్దేశపూర్తకంగా హైకోర్టు మీద, జడ్జిల మీద ఫిర్యాదులు చేశారని, ఆరోపణలు చేస్తున్నారని, వేరే గత్యంతరం లేకపోవడంతో నిందితుడిని 10 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో పిటీషన్ విచారణ
న్యాయవాది అనీల్ కు చెందిన ఓ వివాదం కేసు కోర్టుో విచారణ జరుగుతోంది. ఈ కేసు విషయంలో కోర్టు విచారణ తీరుపై న్యాయవాది అనీల్ రగిలిపోయాడని తెలిసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో జడ్జి మీద లాయర్ ప్రకాష్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన కేసును వేరే బెంచ్ కు బదిలి చెయ్యాలని 219 జూన్ 18వ తేదీన న్యాయవాది ప్రకాష్ సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర మంత్తిత్వ శాఖకు లేఖలు రాయడమే కాకుండా మెమోలు ఇచ్చారు. ఈ షయాన్ని సీరిమయస్ గా తీసుకుంది.

కోర్టులు అంటే లెక్కలేకుండా పోయింది
సుమోటో కేసుగా విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేసిన న్యాయవాది ప్రకాష్ కు కోర్టులు అంటే గౌరవం లేదని, న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేదని, అందుకే వేరే మార్గం లేక జ్యూడిషియల్ కస్టడీకి తరలిస్తున్నామని, జ్యూడీషియల్ కస్టడీ గడుపు ముగిసిన తరువాత మళ్లీ కోర్టు ముందు హాజరుపరచాలని కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తలను కించపరిచిన కేసులో ఓ లాయర్ ను జైలుకు పంపించడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications