Lady: యువతి సీడీఆర్ తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన పోలీసులు, ప్రతాప్ రెడ్డి పంచ్ పడింది, ఢమాల్!

నేరస్తుల ఫోన్ కాల్ డేటా (సీడీఆర్) సేకరించాల్సిన పోలీసులు ఓ యువతి ఫోన్ నెంబర్ మీద నిఘా వేశారు. యువతి కాల్ డేటా మొత్తం బయటకు తీసిన పోలీసులు ఆ డేటాను ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టారు.

బెంగళూరు: నేరస్తుల ఫోన్ కాల్ డేటా (సీడీఆర్) సేకరించాల్సిన పోలీసులు ఓ యువతి ఫోన్ నెంబర్ మీద నిఘా వేశారు. యువతి కాల్ డేటా మొత్తం బయటకు తీసిన పోలీసులు ఆ డేటాను ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టారు. ఓ సీనియర్ పోలీసు అధికారితో పాటు సీడీఆర్ విభాగంలో పని చేస్తున్న మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశామని సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. మాజీ హోమ్ మంత్రి దగ్గర పీఏగా పని చేసిన ఆ పోలీసు అధికారి మీద కూడా చర్యలు తీసుకున్నారు.

ప్రతాప్ రెడ్డికి కోపం వచ్చింది

ప్రతాప్ రెడ్డికి కోపం వచ్చింది

బెంగళూరు సెంట్రల్ విభాగం సూపరెండెంట్ సురేష్, బెంగళూరు ఈస్ట్ టెక్నికల్ విభాగంలో హెడ్ కానీస్టేబుల్ గా పని చేస్తున్న సోమశేఖర్, కానీస్టేబుల్ నాగరాజను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమీనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. విధులు దుర్వినియోగం చేసిన సీనియర్ పోలీసు అధికారి సురేష్, సోమశేఖర్, నాగరాజ్ ల మీద బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

నేరస్తుల మీద నిఘా వెయ్యడానికి పోలీస్ టెక్నికల్ టీమ్

నేరస్తుల మీద నిఘా వెయ్యడానికి పోలీస్ టెక్నికల్ టీమ్

నేరస్తుల మీద, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారి మీద నిఘా వెయ్యడినికి పోలీసు శాఖలో ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ ఉంది. ఈ టెక్నికల్ టీమ్ సభ్యులు నేరస్తులు కాల్ డేటా (సీడీఆర్)ను సేకరిస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రముఖ కన్నడ దినపత్రికకు వివరించారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని విభాగాల్లో ఈ టెక్నికల్ టీమ్ పని చేస్తోందని ఆ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

అమ్మాయి కాల్ డేటా ఎందుకు తీశారు?

అమ్మాయి కాల్ డేటా ఎందుకు తీశారు?

బెంగళూరు సెంట్రల్ విభాగం సూపరెండెంట్ సురేష్ గతంలో ఓ హోమ్ మంత్రి దగ్గర పీఏగా పని చేశారు. ఆ సమయంలో సురేష్ తో ఓ ప్రైవేట్ వ్యక్తి తనకు ఓ అమ్మాయి కాల్ డేటా కావాలని అడిగాడని తెలిసింది. సురేష్, అతను స్నేహితులు కావడంతో అమ్మాయి కాల్ డేటా బయటకు తియ్యడానికి సిద్దం అయ్యారు. పోలీసులు సోమశేఖర్, నాగరాజుకు ఫోన్ చేసిన సురేష్ తనకు ఆ అమ్మాయి కాల్ డేటా మొత్తం కావాలని చెప్పాడు. అమ్మాయి కాల్ డేటా (సీడీఆర్) తీసిన సోమశేఖర్, నాగరాజ్ ఆ లిస్టు సురేష్ కు ఇచ్చారు. పోలీసు అధికారి సురేష్ ఆ లిస్టు తీసుకెళ్లి ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టాడు.

అమ్మాయి కాల్ డేటాతో ఏంపని?

అమ్మాయి కాల్ డేటాతో ఏంపని?

తన కాల్ డేటా మొత్తం ఓ వ్యక్తి తీసుకున్నాడని తెలుసుకున్న ఆ యువతి బెంగళూరు సిటీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. పోలీసు అధికారి సురేష్ తో పాటు సోమశేఖర్, నాగరాజ్ యువతి కాల్ డేటా (సీడీఆర్) తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని రుజువు అయ్యిందని సీసీబీ పోలీసులు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి నివేదిక సమర్పించారు.

ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. అయితే ఏ అమ్మాయి కాల్ డేటా బయటకు తీశారు. కాల్ డేటా సేకరించిన ఆ వ్యక్తి ఎవరు ? అనే విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+