MLA Ticket: మాజీ ప్రధాని ఫ్యామిలీలో టిక్కెట్ ఫైట్, భవాని రేవణ్ణకు చాన్స్ ఇస్తారా ?, ఫ్యామిలీలో ఎంత మంది?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాజీ ప్రధాని ఫ్యామిలీలో ఫైట్ మొదలైయ్యిందని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కోడలు రాజకీయాల్లో రావాలని పట్టుబడుతున్నారు.
బెంగళూరు/హాసన్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు ఎక్కువ అవుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల టిక్కెట్లు ధక్కించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనేక మంది నాయకులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీకి టిక్కెట్ల కోసం చాలా మంది నాయకులు క్యూకడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాజీ ప్రధాని ఫ్యామిలీలో ఫైట్ మొదలైయ్యిందని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు. మాజీ ప్రధాని కోడలు రాజకీయాల్లో రావాలని, తనకు అక్కడే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారని తెలిసింది. అదే ఫ్యామిలీకి చెందిన మాజీ ప్రధాని, మాజీ సీఎం, మాజీ మంత్రి ఇప్పుడు ఒక్క టిక్కెట్ మీద ఎక్కువగా చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

మాజీ ప్రధాని ఫ్యామిలీలో టిక్కెట్ ఫైట్?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే చాలా మంది నాయకులు వారి ప్రచారం మొదలుపెట్టి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక హాసన్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. హసన్ అసెంబ్లీ టిక్కెట్ విషయంలో భారత మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్, దళపతి హెచ్‌డీ దేవెగౌడ కుటుంబంలో చాలా విభేదాలు వచ్చాయని ప్రత్యర్థి పార్టీలలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. మీడియాలో కూడా ఇదే చర్చ జరుుతోంది.

ఆ సీటు నాకే కావాలి
హాసన్‌లో మాజీ ప్రధాని దేవేగౌడ కోడలు భవానీ రేవణ్ణ పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇదే విషయంలో హాసన్ తో పాటు బెంగళూరులో జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ సీఎం కుమారస్వామికి సొంత అన్న అయిన రేవర్ణ సతీమణి భవానీ రేవణ్ణ తనకు హాసన్ టిక్కెట్ ఇప్పించండి అని పట్టుబడుతున్నారని తెలిసింది.
జేడీఎస్ ఇప్పటికే 93 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయగా, జేడీఎస్ రెండో జాబితాను మార్చి రెండో వారంలో విడుదల చేయనుంది. అయితే హసన్ టికెట్ పంపిణీకి ముందే మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ సతీమణి భవాని రేవణ్ణ తనకు టిక్కెట్ వస్తుందని ధీమాతో ప్రాచారం మొదలు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

18 ఏళ్ల నుంచి ప్రయత్నాలు?
తాను రాజకీయాల్లోకి రావాలని కలలు కంటున్న హెచ్‌డీ రేవణ్ణ సతీమణి భవానీ రేవణ్ణ గత 18 ఏళ్ల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని తెలిసింది. అయితే ఇప్పుడు భవానీ రేవణ్ణ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు జేడీఎస్ నాయకులు అంటున్నారు. హాసన్‌కు జేడీఎస్ అభ్యర్థిని నేనే అని ఇప్పటికే ప్రకటించుకున్న భవానీ రేవణ్ణ ప్రచారం మొదలు పెట్టడంతో ఆ పార్టీలోని హాసన్ నాయకుల్లో విభేదాలు మొదలైనాయని తెలిసింది.

ఇంత వరకు క్లారిటీ ఇవ్వని మాజీ ప్రధాని, మాజీ సీఎం
హాసన్ లో సమర్థుడైన అభ్యర్థి పార్టీలో ఉన్నారని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే బహిరంగంగా చెప్పడంతో భవానీ రేవణ్ణ కలలు ఫలిస్తాయా అనే డౌట్ మొదలైయ్యింది. ఈ విషయం దేవెగౌడ కుటుంబంలో చాలా చర్చలు జరుగుతున్నాయని, సోదరులు హెచ్‌డి రేవణ్ణ, హెచ్‌డి కుమారస్వామిలు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రహస్యంగా భేటీ అయ్యి హాసన్ టిక్కెట్ విషయంలో చర్చలు జరిపారని తెలిసింది.
హాసన్ జేడీఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంత వరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ సతీమణి భవానీ రేవణ్ణ మాత్రం హాసన్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తూ బిజీ అయిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

మాజీ ప్రధాని ఫ్యామిలీలో ఎంత మంది రాజకీయాల్లో?
మాజీ ప్రధాని దేవేగౌడ ఎంపీగా ఉన్నారు. మాజీ ప్రధాని కుమారులు కుమారస్వామి మాజీ సీఎం, సిట్టింగ్ ఎమ్మెల్యే. దేవేగౌడ మరో కుమారుడు రేవణ్ణ మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే. మాజీ సీఎం కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే. కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్ కుమారస్వామి గత లోక్ సభ ఎన్నికల్లో మండ్యా నుంచి పోటీ చేసి సుమలత చేతిలో ఓడిపోయారు.
ఇక రేవణ్ణ కుమారుడు హాసన్ ఎంపీ, ఇలా మాజీ ప్రధాని ఫ్యామిలీలో ఇంత మంది రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు రేవణ్ణ భార్య భవానీ కూడా రాజకీయాల్లోకి రావలి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే తండ్రీ కొడుకుల పార్టీ అని పేరు తెచ్చుకున్న జేడీఎస్ లో మరో వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అవుతోందని తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications