Wife: మేడమ్ కు నాలుగో భర్త, సార్ కు రెండో భార్య, ఫామ్ హౌస్ లో పంచాయితీతో ప్రాణాలు ?, క్లైమాక్స్!

బెంగళూరు/రామనగర్: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో నిత్యం గొడవలు పడుతున్నాడు. చివరికి అతని భార్యను చంపేశాడు. భార్య హత్య కేసులో భర్త జైలుకు వెళ్లాడు. కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి తరువాత బయటకు వచ్చాడు. తరువాత వేరే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు చాలా కథ ఉంది. ఇంతకు ముందే ముగ్గురిని వివాహం చేసుకుని వదిలేసిన మహిళను ఇతన్ని నాలుగో పెళ్లి చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఫామ్ హౌస్ లో కాపురం పెట్టారు. ఇదే సందర్బంలో ఆ ఫామ్ హౌస్ లోనే మహిళ హత్యకు గురికావడంతో అందరూ షాక్ అయ్యారు.

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే సమీపంలో నివాసం ఉంటున్న బోరయ్య (53) అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం భద్రమ్మ అలియాస్ భధ్రావతి (40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న భధ్రమ్మ, బోరయ్య దంపతులు రామనగర సమీపంలోని అమ్మనపుర గ్రామంలోని ఆనంద్ నాయక్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ లోని ఔట్ హౌస్ లో ఉంటూ కాపురం చేస్తున్నారు.

మహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య

రాత్రి బోరయ్య పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత బోరయ్య అతని భార్య భద్రమ్మతో గొడవపడ్డాడు, నేను ఇంట్లో లేని సమయంలో ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరెవరు ఇంటికి వచ్చి వెలుతున్నారు అని గొడవ చేశాడు. రెండో భార్య భద్రమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో బోరయ్య పెద్ద కర్ర తీసుకుని అతని రెండో భార్యను చంపేశాడు.

మేడమ్ కు నాలుగో భర్త

మేడమ్ కు నాలుగో భర్త

మరుసటి రోజు ఫామ్ హౌస్ లో పని చెయ్యడానికి వెళ్లిన కూలీలు మామిడి చెట్టుకింద భద్రమ్మ శవమై కనిపించడతో ఫామ్ హౌస్ యజమాి ఆనంద్ నాయక్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి బోరయ్యను అదుపులోకి తీసుకున్నారు. భద్రమ్మ ఇంతకు ముందే ముగ్గురిని వివాహం చేసుకుని ముగ్గురు భర్తలను వదిలేసి తరువాత బోరయ్యను నాలుగో పెళ్లి చేసుకుందని వెలుగు చూసింది.

మొదటి భార్యను చంపేసి జైల్లో?

మొదటి భార్యను చంపేసి జైల్లో?

బోరయ్యకు చాలా పెద్ద స్టోరీ ఉంది. బోరయ్య హోస్ కోటేకి చెందిన బసమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. 2014లో భార్య బసమ్మ మీద అనుమానంతో ఆమెను కనకపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జన ప్రదేశంలో బోరయ్య చంపేశాడు. ఇదే కేసులో అరెస్టు అయిన బోరయ్య జైలుకు వెళ్లాడు.

జైలు నుంచి బయటకు వచ్చి రెండో భార్యను చంపేశాడు

జైలు నుంచి బయటకు వచ్చి రెండో భార్యను చంపేశాడు

కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన బోరయ్య తరువాత హైకోర్టును ఆశ్రయించి కేసు నుంచి విముక్తి పొంది బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన బోరయ్య ముగ్గురు భర్తలను వదిలేసి ఒంటరిగా ఉన్న భద్రమ్మను పెళ్లి చేసుకున్నాడు. విపరీతంగా మదయం సేవించే బోరయ్య ఇప్పుడు అతని రెండో భార్య భద్రమ్మను హత్య చేసి మళ్లీ అరెస్టు అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+