Wife: రెండో పెళ్లి కోసం భార్య, కూతుర్లను చంపేశాడు, జైలు జీవితం, తప్పించుకుని 11 ఏళ్లకు సినిమా స్టైల్లో!
బెంగళూరు: ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఉద్యోగం చేసిన అతను తరువాత రిటైడ్ అయ్యాడు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వదిలేసిన తరువాత బెంగళూరులో భార్య, కూతుర్లతో కాపురం పెట్టి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. జీవన్ సాథీ డాట్ కామ్ లో పరిచయం అయిన మహిళను రెండో పెళ్లికి చేసుకోవాలని సిద్దం అయ్యాడు. రెండో పెళ్లికి మొదటి భార్య, కూతురు అడ్డుంగా ఉన్నారని ముగ్గురిని చంపేశాడు.
రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన భర్త ఆసుపత్రిలో ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసుల కళ్లల్లో కారం చల్లి పరారైనాడు. అప్పటి నుంచి థ్రిల్లర్ సినిమా టైపులో పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగారుడు. 11 సంవత్సరాల తరువాత మరో మహిళను వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఎయిర్ ఫోర్స్ లో రిటైడ్ అయిన వ్యక్తి మరో పెళ్లి చేసుకోవడానికి ఇంతకాలం బ్యాంకులో ఉన్న పెన్షన్ డబ్బు తీసుకోవడానికి వచ్చి 11 సంవత్సరాల తరువాత పోలీసులకు సినిమా ఫక్కీలో చిక్కిపోయాడు. ఇంతకాలం పోటుగాడు ఎలా తప్పించుకుని తిరిగాడో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం
హరియాణాకు చెందిన ధర్మసింగ్ (53) అనే వ్యక్తి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగంలో చేరాడు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్న ధర్మసింగ్ కుటుంబ సభ్యులు చూపించిన ఢిల్లీకి చెందిన అను యాదవ్ అలియాస్ అను అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ధర్మసింగ్, అను యాదవ్ దంపతులకు కీర్తి, శుభం అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఉద్యోగం చేసిన ధర్మసింగ్ 1997లో రిటైడ్ అయ్యాడు.

బెంగళూరులో కాపురం
ఎయిర్ ఫోర్స్ లో రిటైడ్ అయిన ధర్మసింగ్ భార్య అను యాదవ్, కూతుర్లు కీర్తి, శుభంతో కలిసి బెంగళూరు చేరుకుని విద్యారణ్యపురలోని సింాపుర లేఔట్ లో కాపురం పెట్టాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరిన ధర్మసింగ్ భార్య అను యాదవ్, ఇద్దరు కూతుర్లతో కలిసి సంతోషంగా జీవించాడు.

ఓపక్క జీతం, మరో పక్క పెన్షన్....... రెండో పెళ్లికి స్కెచ్
ఎయిర్ ఫోర్స్ లో రిటైడ్ అయిన తరువాత ధర్మసింగ్ కు పెన్షన్ వస్తోంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ధర్మసింగ్ కు జీతం వస్తోంది, రెండు వైపులా సంపాధన వస్తుండటంతో ధర్మసింగ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచించాడు. జీవన్ సాథీ డాట్ కామ్ లో ధర్మసింగ్ అతనికి పెళ్లి కాలేదని, పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నానని తప్పుడు సమాచారం ఇచ్చాడు.

మొదటి భార్య, కూతర్లను చంపేశాడు
జీవన్ సాథీ డాట్ కామ్ లో బెంగళూరులోని రాజాజీనగర్ లోని మహిళ ధర్మసింగ్ కు పరిచయం అయ్యింది. రాజాజీనగర్ కు చెందిన మహిళను రెండో పెళ్లికి చేసుకోవాలని ధర్మసింగ్ సిద్దం అయ్యాడు. రెండో పెళ్లికి భార్య అను యాదవ్, ఇద్దరు కూతురు అడ్డుంగా ఉన్నారని 2008 అక్టోబర్ 19వ తేదీన ఇంట్లోనే చంపేశాడు.

కేసు పెట్టి చిక్కుకున్న కేటుగాడు
భార్య అను యాదవ్, కూతుర్లు కీర్తి, శుభంను హత్య చేసిన నిందితుడు అతని మీదకు కేసు రాకుండా ఉండాలని స్కెచ్ వేశాడు. ముగ్గురు గొంతులు కోసేసి వారి శరీరం మీద ఉన్న బంగారు నగలు చోరీ చేసి తన భార్య, కూతుర్లను ఎవరో చంపేశారని వెళ్లి కేసు పెట్టాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి ధర్మసింగ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే తాను ముగ్గురిని చంపేశానని అంగీకరించాడు.

పక్కాప్లాన్ తో ఎస్కేప్
పోలీసులు ధర్మసింగ్ ను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ధర్మసింగ్ జైల్లో ఉన్నాడు. 2010 డిసెంబర్ లో తనకు అనారోగ్యంగా ఉందని ధర్మసింగ్ పోలీసులకు చెప్పాడు. 2010 డిసెంబర్ 4వ తేదీన విక్టోరియా ఆసుపత్రిలోని ఖైదీల వార్డులో ధర్మసింగ్ ను చేర్పించారు. ధర్మసింగ్ చేతికి బేడీలు కూడా వేశారు. అయితే విక్టోరియా ఆసుపత్రిలో ఉన్న పోలీసుల కళ్లల్లో కారం చల్లిన ధర్మసింగ్ అక్కడి నుంచి తప్పించుకుని హరియాణకు పరారైనాడు.

భార్య బంధువులు, పోలీసుల దెబ్బతో
హరియాణాలో కొంత కాలం ధర్మసింగ్ తల దాచుకున్నాడు. ధర్మసింగ్ గురించి తెలుసుకున్న అతని భార్య అను యాదవ్ కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లి గొడవ చేసి బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య, బంధువులు, పోలీసులకు భయపడిన ధర్మసింగ్ హరియాణా నుంచి తప్పించుకుని అసోం పరారై అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ లో ఉద్యోగంలో చేరాడు.

పెళ్లి కోసం ఆశపడి చిక్కిపోయాడు
ఇంత జరిగినా ధర్మసింగ్ కు పెళ్లి చేసుకోవాలని ఆశ మాత్రం తగ్గలేదు. అసోంలో పరిచయం అయిన మహిళను వివాహం చేసుకోవాలని ధర్మసింగ్ ఆశపడ్డాడు. ఎయిఫోర్స్ లో వస్తున్న పెన్షన్ డబ్బు తీసుకోవడానికి సీక్రేట్ గా బెంగళూరు వచ్చి వెలుతున్నాడని పోలీసులకు తెలిసింది, పెళ్లి కోసం పెన్షన్ డబ్బు తీసుకోవాలని బెంగళూరు వచ్చిన ధర్మసింగ్ సినిమా ఫక్కీలో పోలీసులకు చిక్కిపోయాడు. మూడు హత్యల కేసులో 11 సంవత్సరాల తరువాత ధర్మసింగ్ పోలీసులకు చిక్కడంతో అతని అసలు కథ మొదలైయ్యింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications