Wife: ఆన్ లైన్ మార్కెటింగ్ చేస్తున్న భార్య, ఇంట్లో కూతురితో ఒంటరిగా ఉంటే ?, సీసీటీవీ కెమెరాల్లో !

బెంగళూరు: పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని బావించిన తల్లిదండ్రులు ఐటీ హబ్ కు చేరుకున్నారు. తండ్రి గార్మాంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఆన్ లైన్ లో ఆయుర్వేదిక్ వస్తులు మార్కెటింగ్ చేస్తోంది. ఒక కూతురు ఇంట్లో, మరో కూతురు హాస్టల్ లో ఉంటున్నారు. ఎప్పటిలాగా ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లాడు. ఇంట్లో చిన్న కూతురితో కలిసి భార్య ఒంటరిగా ఉంది. ఉదయం ఇంట్లోకి ఓ వ్యక్తి వెళ్లాడు. నాలుగు గంటల తరువాత ఇంటి నుంచి ఆ వ్యక్తి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం పొద్దుపోయిన తరువాత బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్ అయ్యారు. హాల్, బెడ్ రూమ్ లో తల్లీ కూతురు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు హడలిపోయి కేకలు వేశారు. మహిళకు బాగా పరిచయం ఉన్న వారే ఇంట్లోకి వెళ్లి మూడు గంటలకు పైగా ఉన్నారని, తల్లీ, కూతురిని అతనే హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి వివరాలు రికార్డు అయ్యాయని పోలీసు అధికారులు అంటున్నారు.

చిత్రదుర్గా టూ బెంగళూరు

చిత్రదుర్గా టూ బెంగళూరు

కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా బంగారక్కనహళ్ళిలో చిక్కవీరన్న స్వామి, చంద్రకళ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది. చిక్కవీరన్న స్వామి, చంద్రకళ దంపతులకు రాతన్య (4) అనే కుమార్తె తో పాటు మరో కుమార్తె ఉంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని బావించిన తల్లిదండ్రులు చిక్కవీరన్న స్వామి, చంద్రకళ ఐటీ హబ్ బెంగళూరుకు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చారు.

ఆన్ లైన్ మార్కెటింగ్ చేస్తున్న చంద్రకళ

ఆన్ లైన్ మార్కెటింగ్ చేస్తున్న చంద్రకళ

బేగూరు సమీపంలోని చూడేశ్వరి లేఔట్ లో చిక్కవీరన్న స్వామి, చంద్రకళ కాపురం ఉంటున్నారు. చిక్కవీరన్న స్వామి గార్మాంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. చంద్రకళ ఆన్ లైన్ లో ఆయుర్వేదిక్ వస్తులు మార్కెటింగ్ చేస్తోంది. చిన్న కూతురు రాతన్య ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటున్నది. దంపతుల మరో కూతురు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నది.

 ఇంట్లో కూతురితో ఒంటరిగా ఉంటే ?

ఇంట్లో కూతురితో ఒంటరిగా ఉంటే ?


ఎప్పటిలాగా బుధవారం ఉదయం 9. 30 గంటల సమయంలో చిక్కవీరన్న స్వామి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్లాడు. ఇంట్లో చిన్న కూతురు రతన్యాతో కలిసి చంద్రకళ ఒంటరిగా ఉంది. ఉదయం 10.30 గంటల సమయంలో ఓ వ్యక్తి చంద్రకళ ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో చంద్రకళ ఇంటిలోకి ఆ వ్యక్తి వెలుతున్న విషయం పక్కన నివాసం ఉంటున్న ఓ మహిళ చూసిందని తెలిసింది.

సైలెంట్ గా వెళ్లి పోయాడు

సైలెంట్ గా వెళ్లి పోయాడు

చంద్రకళ ఇంటిలోకి వెళ్లిన వ్యక్తి సుమారు నాలుగు గంటలు అక్కడే ఉన్నాడని తెలిసింది. మద్యాహ్నం 2. 15 నుంచి 2.30 గంటల సమయంలో చంద్రకళ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి కంగారు కంగారుకుగా వెళ్లిపోయాడు. సాయంత్రం పొద్దుపోయిన తరువాత బంధువులు చంద్రకళ ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్ అయ్యారు.

 తల్లీ, కూతురు దారుణ హత్య

తల్లీ, కూతురు దారుణ హత్య

ఇంట్లోని హాల్ లో చంద్రకళ, బెడ్ రూమ్ లో ఆమె కూతురు రతన్యా దారుణంగా హత్యకు గురైనారు. హాల్, బెడ్ రూమ్ లో తల్లీ చంద్రకళ, ఆమె కూతురు రతన్యా దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకున్న బంధువులు హడలిపోయి కేకలు వేశారు. చంద్రకళకు బాగా పరిచయం ఉన్న వారే ఇంట్లోకి వెళ్లి మూడు గంటలకు పైగా ఉన్నారని, చంద్రకళ, ఆమె కూతురు రతన్యాను అతనే హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నగలు, నగదు లూటీ

నగలు, నగదు లూటీ

చంద్రకళ శరీరం మీద ఉన్న బంగారు నగలతో పాటు బీరువాలో ఉన్న కొన్ని నగలు చోరీ అయ్యాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చంద్రకళకు ఆన్ లైన్ మార్కెటింగ్ లో పరిచయం అయిన వారు ఎవరైనా వచ్చి ఆమెను హత్య చేసి బంగారు నగలు లూటీ చేశారా ?, లేదా చిన్నవీర స్వామి కుటుంబ సభ్యులకు పరిచయం ఉన్న వారు ఎవరైనా వచ్చి హత్య చేశారా ? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Recommended Video

    సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు Uttej Wife కన్నుమూత..!! || Oneindia Telugu
    సీసీటీవీ కెమెరాల్లో హంతకుడు ?

    సీసీటీవీ కెమెరాల్లో హంతకుడు ?

    హత్యకు గురైన చంద్రకళా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని కాల్ డేటా ఆధారం విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన చంద్రకళ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి వివరాలు రికార్డు అయ్యాయని, అతన్ని సీసీటీవీ క్లిప్పింగ్స్ లో గుర్తించామని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+