బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తమకూరు: సిటీల్లో పనికి రాకుండా పోతున్న వర్షపు నీటిని, వేస్ట్ అవుతున్న నీటిని శుద్ది చేసి తాగునీరుకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో బయో సెంటర్ ఇండియా (ఎస్ టీపీ) పేరుతో నీటిని, పనికిరాని వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చెయ్యడానికి ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. వందలు, వేల సంఖ్యలో ఉన్న అపార్ట్ మెంట్లలో ఇలాంటి ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఉద్యోగానికి వచ్చిన ఇద్దరు ఉద్యోగులు అదే ప్లాంట్ లో అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపింది.

liplock: లిప్ లాక్ అత్యాచారం చేయాలనుకున్నాడు,రెండు ముక్కలుగా కొరికేసిన యువతి, కిందపడింది !liplock: లిప్ లాక్ అత్యాచారం చేయాలనుకున్నాడు,రెండు ముక్కలుగా కొరికేసిన యువతి, కిందపడింది !

 ఎస్ టీపీ ప్లాంట్ లో ?

ఎస్ టీపీ ప్లాంట్ లో ?

ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లోని వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని తుమకూరులోని కోరగెరె తాలూకాలోని గొల్లరహట్‌కు చెందిన రవికుమార్ (29), ఒడిశాకు చెందిన దిలీప్ కుమార్ జానా అలియాస్ దిలీప్ (25) మృతి చెందిన కూలీలు. కోనెనకంటే క్రాస్ సమీపంలోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్ మెంట్ లో ఈ దారుణం జరిగిందని పోలీసులు అన్నారు.

ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

ప్లాంట్ సూపర్‌వైజర్ రమేష్ రాత్రి కార్మికులకు ఫోన్ చేయగా వారిద్దరూ స్పందించలేదు. నాలుగైదు సార్లు ఫోన్లు చేసినా వారు మాత్రం రిసీవ్ చెయ్యలేదు, కార్మికుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తరువాత అపార్ట్‌మెంట్‌లోని సెక్యూరిటీ గార్డుకు ఫోన్‌ చేసిన రమేష్ ఎస్‌టీపీ ప్లాంట్ దగ్గరకు వెళ్లాల్సిందిగా కోరాడు. తరువాత అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు ఎస్టీపీ ప్లాంట్ దగ్గరకు వెళ్లి తనిఖీ చేయగా కార్మికులు రవికుమార్, దిలీప్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

శవాలైన కార్మికులు

శవాలైన కార్మికులు

కార్మికులు ఇద్దరు చలనం లేకుండా పడివుండటంతో సెక్యూరిటీ గార్డులు హడలిపోయారు. ఏం చెయ్యాలో తెలీక సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ విషయాన్ని సూపర్‌వైజర్ రమేష్‌కు ఫోన్ చేసి చెప్పారు. కార్మికులను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరూ తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న కోణెనెకుంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోస్టుమార్టం నివేదిక వస్తేనే ?

పోస్టుమార్టం నివేదిక వస్తేనే ?

ఇద్దరు కార్మికుల మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదని పోలీసులు అంటున్నారు. ఎస్టీపీ యూనిట్‌లో పని చేస్తున్న సమయంలో విషవాయువు కారణంగా, లేదా విద్యుద్ షాక్ వలన ఇద్దరూ మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనపడటం లేదని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఇద్దరి మృతికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

 కేసు పెట్టిన భార్య

కేసు పెట్టిన భార్య

ఈ ఘటనకు సంబంధించి మృతుడు రవికుమార్‌ భార్య శశికళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎన్‌సీ కంపెనీ యజమాని ముక్తియార్‌ అహ్మద్‌ అలియాస్ ముక్తియార్, ఎలక్ట్రికల్‌ ఇన్ చార్జ్ ప్రభూ, సూపర్‌వైజర్‌ రమేష్‌ కుమార్ అలియాస్ రమేష్, ప్రెస్టీజ్‌ ఫాల్కన్‌ సిటీ అపార్ట్‌మెంట్‌ మేనేజర్‌, ఆ అపార్ట్ మెంట్ యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు అన్నారు. కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం, పని చేసేవారికి రక్షణా పరికరాలు ఇవ్వకపోవడంతో వలనే తన భర్త రవికుమార్ చనిపోయాడని శశికళా ఫిర్యాదు చేశారని, ఆ ఆభియోగాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

English summary
Wife: Two workers died suspiciously at the same time in an apartment in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X