Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిల్క్ చీరల కోసం జట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్న మహిళలు, వైరల్ వీడియో!

బెంగళూరు: చీరలు, నగలు అంటే చాలా మంది ఆడవాళ్లకు పిచ్చి అనే విషయం అందరికి తెలిసిందే. డిస్కౌంట్ సేల్స్ సమయంలో చీరలు కొనడానికి ఆడవాళ్లు పోటీపడుతుంటారు. అలాంటి సిల్క్ చీరల డిస్కౌంట్ సేల్స్ షోరూమ్ లో ఓ చీర కోసం ఇద్దరు ఆడవాళ్లు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

చీరలు, బంగారు నగలు అంటే ఆడవాళ్లు ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో ఓ షోరూమ్ నిర్వహకులు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మైసూర్ సిల్క్ శ్యారీస్ తో పాటు పట్టుచీరలు. ఖరీదైన చీరలు డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తారు. మల్లేశ్వరంలో నిర్వహించే డిస్కౌంట్ శ్యారీస్ కొనుగోలు చెయ్యడానికి బెంగళూరులోని మహిళలు పోటీ పడుతుంటారు.

Women holding their hair and slapping them in a showroom for Mysuru silk sarees in Bengaluru

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం డిస్కౌంట్ శ్యారీ సేల్స్ విక్రయాలు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మహిళలు మల్లేశ్వరంలోని డిస్కౌంట్ శ్యారీస్ కొనుగోలు చెయ్యడాని ఎగబడుతున్నారు. ఈ డిస్కౌంట్ సేల్స్ షోరూమ్ లో ఓ చీర కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వివాదం జరిగింది.

ఆచీర మొదట తాను చూశానని ఓ మహిళ, లేదు నేనే చూశానని, ఆ చీర నేను సెలక్ట్ చేసుకున్నానని మరో మహిళ వాగ్వివాదానికి దిగారు. ఆ చీర ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన మహిళలు ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టియుద్దం చేశారు. ఓచీర కోసం ఇద్దరు మహిళలు ఒకరి మీద ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.

ఒక్కసారిగా చీరల కోసం ఇద్దరు మహిళలు పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్న సాటి మహిళలు హడలిపోయారు. విషయం గుర్తించిన సెక్యూరిటీ గార్డులు ఇద్దరు మహిళలకు సర్ది చెప్పి ఇద్దరిని రెండు వైపులకు పంపించేశారు. చీరల కోసం ఇద్దరు మహిళలు జట్లు పట్టుకుని చెప్పులతో దాడి చేసుకుంటున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు.

చీరల కోసం మహిళలు దాడులు చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కామెట్స్ చేస్తున్న నెటిజన్లు చీరల విషయంలో ఆడవాళ్లకు చిర్రెత్తిపోతే వాళ్ల భర్తలను గుర్తు చేసుకుని ఎదుటి వాళ్లను చితకబాదుతారు జాగ్రత్త అంటూ కామెంట్ పోస్టు చేస్తున్నారు. మొత్తం మీద సిల్క్ శ్యారీస్ విషయంలో ఇద్దరు మహిళలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+