Youth: వినాయకుడి విగ్రహం ఏర్పాటుకు పోలీసుల అనుమతి కోసం వెళ్లి, ముగ్గురి ప్రాణాలు గాలిలో, విషాదం!
బెంగళూరు/ దావణగెరె: వినాయక చవితి పండుగ సందర్బంగా వినాయకుడిని ప్రతిష్టించడానికి పోలీసుల అనుమతి కోసం యువకులు ఉత్సాహంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. భారీ వినాయకుడిని తమ ప్రాంతంలో ప్రతిష్టించడానికి మిగిలిన యువకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ అర్బాటాలకు పోకుండా వినాయుడి విగ్రహం పత్రిష్టించుకోవాలని, ఎలాంటి హంగామాలు లేకుండా వినాయకుడి విగ్రహం నిమజ్జనం చెయ్యాలని పోలీసులు అనుమతి ఇచ్చారు.
వినాయుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఉత్సాహంగా ఇంటికి తిరిగి వెలుతున్న యువకుల బైక్ ను బోలెరో వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. వినాయుడి విగ్రహం ఏర్పాటు చేసుకోని పండుగ జోరుగా జరుపుకోవాలని ప్రయత్నించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు.

వినాయకుడి విగ్రహం ప్రతిష్టించాలని యువకుల ఉత్సాహం
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి తాలుకాలోని రాజగొండనహళ్ళిలో మల్లేశపురలో అజ్జయ్య (18), దేవరాజ్ (18), మంజునాథ్ (18) అనే యువకులు నివాసం ఉంటున్నారు. రాజగొండనహళ్ళిలో వినాయుడి విగ్రహం ఏర్పాటు చెయ్యాలని స్థానిక యువకులు నిర్ణయించారు. ఇప్పటికే గ్రామంలో ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేశారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువకులు
వినాయక చవితి పండుగ సందర్బంగా వినాయకుడిని ప్రతిష్టించడానికి పోలీసుల అనుమతి కోసం అజ్జయ్య, మంజునాథ్, దేవరాజ్ తదితర యువకులు ఉత్సాహంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. భారీ వినాయకుడిని తమ ప్రాంతంలో ప్రతిష్టించడానికి మిగిలిన యువకులు రాజగొండనహళ్లిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరిగి వస్తుంటే ?
కోవిడ్ నియమాలు పాటిస్తూ అర్బాటాలకు పోకుండా వినాయుడి విగ్రహం పత్రిష్టించుకోవాలని, ఎలాంటి హంగామాలు లేకుండా వినాయకుడి విగ్రహం నిమజ్జనం చెయ్యాలని పోలీసులు అనుమతి ఇచ్చారు. వినాయుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో యువకులు బైక్ లో ఉత్సాహంగా ఇంటికి తిరిగి వెలుతున్నారు. ఆ సమయంలో యువకుల బైక్ ను చెన్నగిరి వైపు వెగంగా వెలుతున్న బోలెరో వాహనం ఢీకొనింది.
Recommended Video

ఆసుపత్రికిలో ప్రాణాలు పోయాయి
ఒకే బైక్ లో వెలుతున్న వాహనం ఢీకొనడంతో అజ్జయ్య, దేవరాజ్, మంజునాథ్ కు తీవ్రగాయాలైనాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లే సమయానికే ఇద్దరి ప్రాణాలు పోయాయి. తీవ్రగాయాలైన మరో యుకుడి ప్రాణం పోయింది. వినాయుడి విగ్రహం ఏర్పాటు చేసుకోని పండుగ జోరుగా జరుపుకోవాలని ప్రయత్నించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారైనాడని, మద్యం సేవించి వాహనం నడిపాారా అని ఆరా తీస్తున్నామని దావణగెరె పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications