వాషింగ్టన్: అమెరికాలో ఉల్కాపాతం ఆ దేశస్తులను వణికించింది. ఓ ఉల్క తమ వైపు దూసుకొచ్చి పేలిపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం అమెరికాలోని పశ్చిమతీరం, కెనడాల్లో ఈ ఉల్కపాతం కనిపించింది.
ఒహియో, మిచిగాన్, ఆంటారియోల్లో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆకాశంలో నుంచి ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొస్తున్న గ్రహశకలాన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించారు.
కొంతమంది ఈ ఉల్కాపాతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఉల్క పేలుడుకు తూర్పు మిచిగాన్‌లోని సెయింట్ క్లెయిర్ తీరంలో 2.0 తీవ్రతతో భూమి కంపించింది.
అది ఉల్కపాతమేనని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. మొదట్లో అది మెరుపో లేక పిడుగో అనుకున్నా.. చివరికి అది ఉల్కపాతమేనని తేలినట్లు డెట్రాయిట్‌లోని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) వెల్లడించింది.
అయితే ఊహిచని విధంగా ఉల్కాపాతం సంభవించడం, అత్యంత ప్రకాశవంతంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిని గమనించిన పలువురు భూమిపైకి ఏలియన్స్ వచ్చారా? లేక భూమి అంతం అవుతోందా? అంటూ ట్వీట్లు చేశారు.
A bright meteor briefly swept across the sky over parts of the U.S. Midwest and Canada on Tuesday, weather and geology agencies said, and then caused a powerful explosion that rattled homes and onlookers. The meteor was seen across the region in places such as Ohio, Michigan and Ontario at about 8 p.m. local time and registered a 2.0 magnitude tremor about 4 miles (7 km) east of Saint Clair Shores in Eastern Michigan, the United States Geological Survey said on its website. The National Weather Service (NWS) confirmed it was not a meteorological event but more likely a meteor. “The NWS can confirm the flash and boom was NOT thunder or lightning, but instead a likely meteor,” the NWS in Detroit said on Twitter.
Story first published: Wednesday, January 17, 2018, 18:04 [IST]