ఇక బీరే పెట్రోలు: ఆ ప్రయోగం సక్సెస్.. ఫ్యూచర్‌లో అదే ప్రత్యామ్నాయం?

Subscribe to Oneindia Telugu

లండన్: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. పెట్రోలుతో కాదు బీర్లతో కార్లు నడిపేయొచ్చని నిరూపిస్తున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. బీరు ద్వారా ఇంధనాన్ని తయారుచేయడంలో వారు సఫలమయ్యారు.

శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తయారుచేసే క్రమంలో శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. దానికి సంబంధించిన ఫార్ములాను కూడా వెల్లడించారు. ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో ఉండే ఆల్కహాల్‌లో ఎథనాల్ ఉంటుందని, దీనిని బ్యుటనాల్‌గా మార్చడం ద్వారా పెట్రోలుకు ప్రత్యామ్నాయం తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Beer can be turned into fuel and used as a sustainable replacement for petrol

యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ప్రొఫెసర్ డంకన్ వాస్ ఈ వివరాలు వెల్లడించారు. ఎథనాల్ విరివిగా లభ్యమయ్యే కెమికల్ కావడంతో దీన్ని బ్యుటనాల్‌గా మార్చి పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా వినియోగించాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియను కాటలిస్ట్‌గా పిలుస్తున్నారు. దీనిపై ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం లేబరేటరీ స్థాయిలో ఈ ప్రయోగం విజయవంతమైంది.క్యాటలిస్ట్స్ బీర్లలోని ఎథనాల్‌ను విజయవంతంగా బ్యుటనాల్‌గా మార్చడంలో తాజా ప్రయోగాలు విజయవంతమయ్యాయని డంకన్ వాస్ తెలిపారు. దీనిని లేబోరేటరీ స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లడానికి సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chemists at the University of Bristol have spent years developing technology to convert widely-available ethanol into butanol.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X