అభిమానం ఇంత పని చేయిస్తుందా?: ఏంజెలీనా ఫ్యాన్ ఎంత దాకా వెళ్లిందంటే..

Recommended Video

    ఆ హీరోయిన్‌ అంటే పిచ్చి.. 50 సర్జరీలకు తెగించింది !

    వాషింగ్టన్/టెహ్రాన్: స్క్రీన్ మీద హీరోల్ని చూసి రియల్ లైఫ్ లోను అలాంటి స్టైల్స్‌ను అనుసరించే అభిమానులు కోకోల్లలు. చేస్తున్నది మంచో చెడో కూడా ఆలోచించుకోలేనంత అభిమానపు ఊబిలో చిక్కుకుపోయి ఉంటారు.

    ఇరాన్‌కు చెందిన ఓ అమ్మాయి కూడా ఇలాంటి పిచ్చి అభిమానంతో చివరాఖరికి తానే చిత్తయిపోయింది. తానూ అందగత్తె అయినప్పటికీ.. అభిమాన నటి ఏంజెలినా జోలిలా కనిపించాలన్న ఆరాటం ఆమె ముఖాన్ని అష్టవంకరలు తిప్పింది. అందానికి ఆమె ఇచ్చుకున్న 'ఏంజెలినా' నిర్వచనం.. ఇప్పుడామెను ప్రపంచానికి అందవికారంగా పరిచయం చేస్తోంది.

    ది సన్ కథనం ప్రకారం.. ఇరాన్‌కు చెందిన టీనేజర్ సహర్ తబర్ (19) ఏంజెలినా జోలికి పెద్ద ఫ్యాన్. ఆమెలా కనిపించడం కోసం ఏదైనా చేయాలని తబర్ తాపత్రయపడేది. ఈ క్రమంలో ఎటువంటి ప్రయోగానికైనా వెనుకాడలేదు. అలా ముఖానికి దాదాపు 50సర్జరీలు చేయించుకుంది.

    bizarre: 19-year-old got 50 surgeries to look like Angelina Jolie. Now trolls are calling her zombie

    అంతేకాదు, 40కేజీలకు మించి పెరగకుండా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ వస్తోంది. వీటన్నింటి ఫలితంగా ఆమె ఇప్పుడెంత దారుణంగా తయారైందో ఫోటోల్లో చూడవచ్చు. ఒకప్పటి ఆమె ఫోటోకు, ఇప్పుడున్న అవతారానికి అసలు పోలికే లేదు.

    తబర్ తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుండటంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3,25,000మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ సంఖ్య ప్రతీ నిమిషానికి పెరుగుతూనే ఉంది. అందం కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్ని విఫలమై.. చివరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా అగ్లీ సెలబ్రిటీలా మిగిలిపోయింది తబర్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+