బంగారం.. అసలు భూమిలోకి ఎలా వచ్చిందో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: భూమ్మీద విలువైన వాటిలో బంగారం.. కూడా ఒకటి. బంగారం పేరు చెబితే చాలు మహిళలు పడి చచ్చిపోతారు. చెవులు, ముక్కు.. చేతులు, మెడ... ఇలా ఎక్కడపడితే అక్కడ దాన్ని ఆభరణాల రూపంలో అలంకరించుకుంటారు.

అయితే ఇంత విలువైన ఈ లోహం అసలు మన భూమిలోకి ఎలా వచ్చి చేరిందో తెలుసా? బంగారం ఇతర విలువైన లోహాలు భూమి లోపల ఏలా ఏర్పడ్డాయనే దానిపై రకరకాల పరిశోధనలు, సిద్ధాంతాలు ఉన్నాయి.

Moon-like planetary body may have delivered gold, platinum to Earth

అయితే తాజా పరిశోధన ఒకటి వీటికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో సౌత్‌వెస్ట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌కు చెందిన బృందం బంగారంపై పరిశోధనలు చేపట్టింది.

భూ గ్రహం ఏర్పడే సమయంలో చంద్రుడు అంత సైజులో ఉన్న ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందట. ఆ తర్వాత అది భూమి అంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురవడం వల్ల బంగారం, ప్లాటినం వంటి లోహాలు ఉద్భవించాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

'బంగారం, ప్లాటినంలాంటి విలువైన లోహాల ఆవిర్భావంలో భారీ శకలాలు భూమిని ఢీకొట్టే పాత్రను మా పరిశోధనలు విశదీకరించాయి..' అని అమెరికాలోని సౌత్‌వెస్ట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు సిమోన్‌ మార్చి వెల్లడించారు.

గతంలో అంచనా వేసినదానికంటే భూమి లోపల ఉన్న లోహాల పరిమాణం రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధన వివరాలు నేచర్‌ జియోసైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A large Moon-sized planetary body may have penetrated all the way down to the Earth's core during the early days of our planet's formation, delivering precious metals such as gold and platinum, a study has found. Researchers at the Southwest Research Institute (SwRI) and University of Maryland in the US created high-resolution impact simulations that show significant portions of a large planetesimal's core could penetrate all the way down to merge with Earth's core - or ricochet back into space and escape the planet entirely.In the research published in the journal Nature Geoscience, Simone Marchi and his colleagues found evidence of more massive accretion onto the Earth than previously thought after the Moon's formation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X