అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మార్ తో వ్యాపార భాగస్వామ్యం క్లోజ్..

అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన వాటాను తన చిరకాల భాగస్వామి అయిన సింగపూర్ కు చెందిన విల్ మార్ ఇంటర్నేషనల్‌ సంస్థకు అమ్మేయనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో సంస్థలో వృద్ధి పరంగా ఎన్నో మార్పులకు అడుగు పడనున్నట్లు భావిస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL).. AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌ సంస్థలోని తన వాటాను సింగపూర్‌ కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్‌ సంస్థకు అమ్మేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జూలై 17, 2025న స్టాక్ ఎక్స్ఛేంజ్‌ లకు సమాచారం అందించింది. ఈ మేరకు రూ. 10,874 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు స్పష్టం చేసింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పి (ACL), AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌లో మిగిలిన 10.42 శాతం వాటాను త్వరలో విక్రయించనుంది, దీంతో ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుండి పూర్తిగా నిష్క్రమించనుంది. జనవరిలో, ACL ఇప్పటికే AWLలో 13.51 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గం ద్వారా విక్రయించి రూ. 4,855 కోట్లు ఆర్జించింది.

ఒప్పందం ప్రకారం అదానీ విల్మార్‌ లో అదానీ కమోడిటీస్‌కు ఉన్న 30.42 శాతం వాటాలో 20 శాతం విల్మార్‌ సంస్థకు విక్రయించనుంది. మిగిలిన మొత్తాన్ని ముందుగా ఎంపిక చేసిన ఇన్వెస్టర్లకు అమ్మనున్నట్టు అదానీ ఎంటర్‌ ప్రైజెస్ అధికారికంగా తెలిపింది. ఒప్పందం ప్రకారం, ACL AWL అగ్రి బిజినెస్‌ లో 20 శాతం వాటాను లెన్స్‌కు ఒక్కో షేరుకు రూ. 275 చొప్పున విక్రయించనుంది, ఈ ఒప్పందం విలువ రూ. 7,150 కోట్లుగా ఉంది.

SEBI నిబంధనల ప్రకారం జనవరి 2025లో, AEL/ACL AWL లో తన షేర్‌ హోల్డింగ్‌లో 13.5 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ. 276.51 చొప్పున విక్రయించింది. ఆ విక్రయం తర్వాత ACL వాటా 30.42 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇరు కంపెనీల మధ్య జరుగుతున్న ఈ లావాదేవీలు పూర్తయిన తర్వాత అదానీ, విల్మార్‌ సంస్థతో 1999లో ప్రారంభమైన భాగస్వామ్యం ముగుస్తుంది.

అదానీ గ్రూప్ తన 44 శాతం వాటా నుండి రూ. 15,700 కోట్లు ఆశిస్తోంది. ఫార్చ్యూన్ బ్రాండ్ కింద వంట నూనెలతోపాటు ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయించే AWL అగ్రి బిజినెస్‌ లో తన మొత్తం 44 శాతం వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా అదానీ గ్రూప్ రూ. 15,700 కోట్లకు పైగా లాభం చేకూరనుంది. గత ఏడాది డిసెంబర్‌ లో, అదానీ గ్రూప్ తన ప్రధాన మౌలిక సదుపాయాల వ్యాపారాలపై దృష్టి సారించడానికి AWL లో తన మొత్తం 44 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది.

Adani Enterprises to Exit AWL Agri Business Sells Stake to Wilmar International

ఈ నిర్ణయంతో అదానీ, విల్మార్ మధ్య గతంలో అంటే 1999, 2014, 2017, 2021 సంవత్సరాల్లో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాలు రద్దు కానున్నాయి. మరోవైపు విల్మార్ ఆధ్వర్యంలో AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ వృద్ధితో దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇలా యాజమాన్య హక్కులు ఒకరి దగ్గరే ఉండటం కారణంగా విల్మార్ సారథ్యంలో భారత వ్యవసాయ, FMCG మార్కెట్లు మరింత బలపడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+