అదానీ బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రక్తదాన శిబిరాలు
అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పుట్టినరోజు సందర్భంగా మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదానీ గ్రూప్స్ సంస్థ. జూన్ 24 న గౌతమ్ అదానీ 63వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది అదానీ ఫౌండేషన్. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 206 నగరాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
అదానీ ఫౌండేషన్ తరఫున అదానీ హెల్త్ కేర్ టీమ్స్ ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం ద్వారా 27,661 యూనిట్లు(11,100లీటర్ల) రక్తాన్ని సేకరించి గతేడాది రికార్డును బద్దలు కొట్టింది అదానీ ఫౌండేషన్. గతేడాది అదానీ 62వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో 25,282 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సారి ఆ రికార్డును అధిగమించింది అదానీ గ్రూప్.
రక్తదాన శిబిరాల ద్వారా 27,661 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని 83,000 మందికి పైగా రోగులకు సాయం చేసింది. రక్తంతోపాటు పీసీవీ, ప్లేట్ లెట్స్, ప్లాస్మా, ఎఫ్ఎఫ్ పీ, క్రయోప్రెసిపిటేట్, అల్బుమిన్ ను సేకరించి రోగుల కోసం అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంపై అదానీ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్. ప్రీతీ అదానీ స్పందించారు.

" అదానీ గ్రూప్ లోని ప్రతి కుటుంబ సభ్యుడికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు ముందడుగు వేసి ఈ సేవను విజయవంతం చేశారు. మీరు నిర్వహించిన ఈ కార్యక్రమం వేల మంది రోగులకు చేరువవుతుంది" అని అదానీ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్. ప్రీతీ అదానీ తెలిపారు.
ఈ రక్తదాన కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్, ప్రభుత్వ ఆస్పత్రుల ఒప్పందంతో అదానీ ఫౌండేషన్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి 3వేల మంది వైద్యులు, పారామెడిక్స్, డేటా ఆపరేటర్లు, సిబ్బంది మద్దతు తెలిపి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి విదేశాల్లోనూ రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
కొలంబోలోని కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ పోర్టులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే టాంజానియాలోని దార్- ఈ- సలామ్ పోర్టులోనూ నిర్వహించారు. టాంజానియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా దాతలు వచ్చి రక్తాన్ని ఇచ్చారు. 2011 నుంచి అదానీ ఫౌండేషన్ ఏటా గౌతమ్ అదానీ బర్త్ డే సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. మానవ సేవే దైవ సేవ అన్న అదానీ సిద్ధాంతానికి కట్టుబడి ఏళ్లుగా అదానీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications