FY-26 తొలి త్రైమాసికంలో అదానీ రికార్డు స్థాయిలో దూకుడు.. పూర్తి వివరాలు ఇవే..
అదానీ గ్రూప్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1FY26) రికార్డు స్థాయిలో రూ. 90,572 కోట్ల EBITDA(వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనానికి ముందు ఆదాయం)ను నమోదు చేసింది. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల నుంచి గణనీయమైన సహకారం లభించడంతో ఈ వృద్ధి సాకారమైంది. కంపెనీల పోర్ట్ ఫోలియో మెరుగైన పనితీరు ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయాలకు తోడ్పడటంతో పాటు, తక్కువ రుణ నిష్పత్తిని కొనసాగించింది.
అదానీ గ్రూప్ భారత్ లోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థగా పేరుపొందింది. అయితే తాజాగా ఆ సంస్థ ఆర్థిక పనితీరు వివరాలను ఆగస్టు 28, 2025న ప్రకటించింది. గత 12 నెలల (TTM) పనితీరుతో పాటు, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1FY26), దాని రుణ పనితీరును కూడా వెల్లడించింది.
పోర్ట్ ఫోలియో EBITDA తొలిసారిగా రూ. 90,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. Q1FY26 EBITDA కూడా రికార్డు స్థాయికి చేరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ & సెజ్, అంబుజా సిమెంట్స్‌తో పాటు ఏఈఎల్ కింద ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌లో నిలకడ వృద్ధి ఈ బలమైన పనితీరుకు దోహదపడింది.
ఈ వ్యాపారాల నుండి లభించిన బలమైన సహకారం, ఏఈఎల్ ప్రస్తుత వ్యాపారాల్లో క్షీణతను భర్తీ చేసింది. ఐఆర్ఎం (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)లో వాణిజ్య పరిమాణం తగ్గడం, సూచీ ధరల అస్థిరత కారణంగా ఏఈఎల్ ప్రస్తుత వ్యాపారంలో ప్రతికూల వృద్ధి నమోదైంది.
నిలకడగా విస్తరిస్తున్న EBITDA, కంపెనీ ప్రణాళికాబద్ధమైన వార్షిక మూలధన వ్యయం రూ. 1.5-రూ. 1.6 లక్షల కోట్లకు బలమైన మద్దతునిస్తుంది. అదానీ గ్రూప్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 90,572 కోట్ల రికార్డు EBITDAను సాధించినట్లు నివేదించింది.
రుణాల విషయానికి వస్తే, పోర్ట్‌ఫోలియో స్థాయి రుణభారం ప్రపంచంలోనే అత్యల్పంగా 2.6 రెట్లు నికర రుణానికి EBITDA నిష్పత్తిగా కొనసాగింది. అంతేకాకుండా, రూ. 53,843 కోట్ల అధిక నగదు నిల్వలు నిర్వహించబడ్డాయి. ఇది కంపెనీ బలమైన ద్రవ్యతను సూచిస్తుంది.
యూటిలిటీ రంగంలో Q1FY26లో రూ. 11,895 కోట్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగంలో రూ. 5,949 కోట్లు, ఏఈఎల్ - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాలలో రూ. 2,825 కోట్లు, అడ్జెన్సీస్ (సిమెంట్)లో రూ. 2,242 కోట్లు EBITDA నమోదైంది. ఈ రంగాలన్నీ గణనీయమైన వృద్ధిని సాధించాయి.
అదానీ గ్రూప్ 2025 జూన్ నాటికి ట్రాక్ లింగ్ ట్వెల్వ్ మంత్ (TTM) ఆధారంగా పోర్ట్ ఫోలియో EBITDA 10 శాతం వృద్ధితో రూ. 90,572 కోట్లకు చేరింది. Q1FY26 EBITDA 3.3 శాతం వృద్ధితో రూ. 23,793 కోట్లతో రికార్డు స్థాయికి చేరింది.

విశ్వసనీయమైన 'కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' పోర్ట్ ఫోలియో నగదు ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మొత్తం పోర్ట్ ఫోలియో EBITDAలో సుమారు 87శాతం తోడ్పడింది. 2025 జూన్ నాటికి, రుణ ప్రొఫైల్ మరింత పటిష్టమైంది, రూ. 99,561 కోట్ల రన్-రేట్ EBITDAలో 87 శాతం దేశీయ రేటింగ్‌లలో 'AA-' మరియు అంతకంటే ఎక్కువ ఉన్న ఆస్తుల నుండి ఉత్పత్తి అవుతుంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ & సెజ్, అదానీ సిమెంట్స్ (అంబుజా) రెండంకెల EBITDA వృద్ధిని సాధిస్తూనే ఉన్నాయి. అన్ని పోర్ట్ ఫోలియో కంపెనీలలో రాబోయే 12 నెలలకు రుణ సేవలను కవర్ చేయడానికి తగినంత ద్రవ్యత నిర్వహించబడింది.
2025 మార్చి 31 నాటికి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) ఇంక్యుబేటెడ్ వ్యాపారాలు అధిక వృద్ధి పథంలో ఉన్నాయి. అనీల్ భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-గ్రిడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ను విజయవంతంగా ప్రారంభించింది.
Q1FY26లో ప్రయాణీకుల రాకపోకలు సంవత్సరానికి 3శాతం పెరిగి 23.4 మిలియన్లకు, కార్గో రాకపోకలు సంవత్సరానికి 4 శాతం పెరిగి 0.28 MMTకి చేరుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కార్యకలాప సామర్థ్యం సంవత్సరానికి 45 శాతం పెరిగి 15,816 MWకి చేరుకుంది.
సౌర మరియు పవన విద్యుత్ ప్లాంట్లను చేర్చడం ద్వారా ఇది సాధ్యమైంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (ఏఈఎస్ఎల్) WRNES తలేగావ్ లైన్ అనే కొత్త ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ ను పొందింది. అదానీ పోర్ట్స్ & సెజ్ (ఏపీఎస్ఈజెడ్) వాల్యూమ్ Q1FY26లో సంవత్సరానికి 11 శాతం పెరిగి 121 MMTకి చేరింది. అదానీ సిమెంట్స్ (అంబుజా) ప్రస్తుత సిమెంట్ సామర్థ్యం సుమారు 105 MTPAగా ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications