Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బైక్ మార్కెట్‌లో కొత్త పల్సర్ సునామీ: ఈ రేంజ్‌లో ఈ ఫీచర్ ఎక్కడా లేదు!

ఆటోమోటివ్ దిగ్గజం బజాజ్ ఆటోమొబైల్స్ భారత మార్కెట్లో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ సిరీస్‌ను విస్తరిస్తూ కొత్త పల్సర్ N160 వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. మరోసారి స్పోర్టీ బైక్ ప్రియులను ఆకట్టుకునేందుకు తన 160 సీసీ సెగ్మెంట్‌ను వినూత్నంగా విస్తరించింది.ఎక్స్-షోరూమ్ ధర రూ.1,23,983గా నిర్ణయించబడిన ఈ కొత్త మోడల్, సెగ్మెంట్‌కు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పటికే N160 పవర్, పర్ఫార్మెన్స్, రైడింగ్ కంఫర్ట్‌తో యువతలో తిరుగులేని క్రేజ్ సంపాదించగా, ఈసారి తీసుకొచ్చిన కొత్త మోడల్ ఆ ఆకర్షణను మరింత పెంచేలా ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో అత్యంత ప్రధానమైన, సెగ్మెంట్-లీడింగ్ హైలైట్ ఏంటంటే... అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్ సస్పెన్షన్ సిస్టమ్.

గోల్డెన్ USD ఫోర్క్: ఒకే లుక్‌తో అటెన్షన్ పక్కా!

కొత్త N160లో ముందు భాగంలో తలక్రిందులుగా అమర్చిన ఈ USD ఫోర్క్...బైక్‌కు అగ్రెసివ్, ప్రీమియమ్ స్పోర్టీ లుక్‌ని అందిస్తుంది. హ్యాండ్లింగ్, స్టీరింగ్ స్టెబిలిటీ, బ్రేకింగ్ సమయంలో మెరుగైన కంట్రోల్‌ను అందిస్తుంది. గుంతలు, మలుపుల్లో కూడా బైక్‌పై పూర్తి పట్టు ఉంటుంది. ప్రత్యేకంగా బైక్‌కు అమర్చిన గోల్డెన్ కలర్ USD ఫోర్క్ రోడ్డుపై ప్రత్యేకంగా మెరుస్తూ, ఎవరినైనా ఒకసారి వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది. ఇది పల్సర్ రోడ్డుపై ప్రెజెన్స్‌ను పూర్తిగా మార్చేస్తుంది.

ధర, సౌకర్యం, కస్టమర్లే కింగ్!

బజాజ్ ఈ ప్రీమియమ్ ఫీచర్లకు పెద్దగా ధర పెంచకుండా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ కొత్త వేరియంట్‌ను రూ. 1.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ ధరలో USD ఫోర్క్ వంటి ప్రీమియమ్ ఫీచర్ ఇవ్వడం ఇతర బ్రాండ్‌లతో పోలిస్తే బజాజ్‌కి ఒక పెద్ద పోటీ అడ్వాంటేజ్‌గా మారింది. ఇంతకుముందు N160లో స్ప్లిట్-సీట్ సెటప్ ఉండేది. అయితే ఈ కొత్త వేరియంట్‌లో సింగిల్-పీస్ సీటు ఇచ్చారు. ఇది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాదు, రోజువారీ రైడర్‌లకు, ముఖ్యంగా పిలియన్ (వెనుక కూర్చున్న వ్యక్తి)కు మరింత సౌకర్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఇంజినీరింగ్ అప్‌గ్రేడ్.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

కొత్త వేరియంట్‌లో డిజైన్, సస్పెన్షన్‌లలో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు ఇచ్చినప్పటికీ, బజాజ్ ఇంజిన్ సెటప్‌ను మాత్రం యధావిధిగా కొనసాగించింది. . ఈ బైక్‌లో 164 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ ఇప్పటికే మార్కెట్లో తన విశ్వసనీయత, సరళమైన పవర్ డెలివరీ, దృఢమైన పనితీరుతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఇంజన్ 15 హెచ్‌పీ పవర్, 14 ఎన్ఎమ్ టార్క్‌ను స్థిరంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ అవుట్‌పుట్ రోజువారీ రైడింగ్‌కు, సిటీ ట్రాఫిక్‌లో చురుగ్గా కదలడానికి, హైవేపై క్రూజింగ్‌కు కూడా సరిపోతుంది. ఈ బైక్‌కు జతచేసిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ గేర్ షిఫ్ట్‌లను సున్నితంగా, త్వరగా స్పందించేలా చేస్తుంది. ఈ ట్రాన్స్‌మిషన్ సెటప్ రైడర్‌కు మంచి నియంత్రణతో పాటు, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

బ్రేకింగ్, భద్రత

బ్రేకింగ్ విషయంలో N160 తన సెగ్మెంట్‌లో అత్యంత బలమైన పాయింట్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 300mm డిస్క్, వెనుక భాగంలో 230mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అందించడం వల్ల బ్రేకింగ్ సమయంలో పూర్తి భద్రత లభిస్తుంది. ఈ ABS సెటప్‌కు అనుబంధంగా, N160లో రోడ్, రైన్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్

కొత్త N160 ఇప్పుడు నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. మెటాలిక్ వైట్ (Metallic White), రేసింగ్ రెడ్ (Racing Red), పోలార్ స్కై బ్లూ (Polar Sky Blue), డీప్ బ్లాక్ (Deep Black) కలర్ ఆప్షన్లలో ఈ బైక్ దొరుకుతుంది. ప్రత్యేకించి కొత్త పెర్ల్ ఫినిషింగ్ బాడీ ప్యానెల్స్‌పై పడే కాంతిని అద్దంలా ప్రతిబింబిస్తూ, బైక్‌కు ఒక ప్రీమియమ్ లుక్‌ను అందిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+