నకిలీ స్టాక్+బ్యాలెన్స్ షీట్లు: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.89 కోట్ల శఠగోపం..సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో కుంభకోణాలు, రుణ మోసాల ప్రక్రియ యదేచ్ఛగా కొనసాగుతున్నది. మోసాలకు గురైన పీఎన్బీ, ఐడీబీఐ, ఎస్బీఐల జాబితాలోకి తాజాగా మరో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది.

పంజాబ్‌లో రెండు ప్రైవేట్ సంస్థలు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రూ.89 కోట్ల మేర రుణాలను తీసుకొని ఎగనామం పెట్టాయి. వీటిలో గుర్‌దాస్‌పూర్ మండీకి చెందిన ఆగ్రో టెక్ కంపెనీ ఒకటికాగా, పఠాన్‌కోట్‌కు చెందిన మరో ప్రైవేట్ సంస్థ ఉన్నది.

కట్టుకథలతో రుణాలు తీసుకున్నట్లు వెల్లడి

కట్టుకథలతో రుణాలు తీసుకున్నట్లు వెల్లడి

ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ( సీబీఐ) ఈ రెండు సంస్థలకు చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. ఆగ్రో కంపెనీ రూ.61.01 కోట్లు, నంగ్లీ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.28.30 కోట్ల రుణం తీసుకొని మోసం చేశాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నంగ్లీ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు బ్యాంకుకు కట్టుకథ చెప్పి ఈ రుణాన్ని తీసుకున్నారని, ఆ తర్వాతి క్రమంలో వీటిని చెల్లించలేదని సీబీఐ గుర్తించింది.

నకిలీ స్టాక్.. బ్యాలెన్స్ షీట్లతో రుణాలు

నకిలీ స్టాక్.. బ్యాలెన్స్ షీట్లతో రుణాలు

రెండు కంపెనీల డైరెక్టర్లు విజయ్ కుమార్, సతీశ్ కుమార్, మనోజ్ కుమార్, అనిల్ కుమార్‌లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్‌లోని హోషైపూర్, గుర్‌దాస్‌పూర్, అమృత్‌సర్, పఠాన్‌కోట్ వద్ద ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ఆస్తులపై గురువారం దాడులు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో రెండు చార్టర్డ్ అక్కౌంటెంట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం ఉన్నదని సమాచారం. స్టాక్ లేకున్నా, ఉన్నట్లు నకిలీ పత్రాలు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించి రుణాలు తీసుకున్నారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్ కే గౌర్ తెలిపారు.

 ఫైర్ స్టార్ తదితర సంస్థల విక్రయానికి అనుమతించొద్దని న్యూయార్క్ కోర్టులో పీఎన్బీ పిటిషన్

ఫైర్ స్టార్ తదితర సంస్థల విక్రయానికి అనుమతించొద్దని న్యూయార్క్ కోర్టులో పీఎన్బీ పిటిషన్

మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నుంచి తమకు రావల్సిన బకాయిలను వసూలు చేయలేమేమోనని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఆందోళన చెందుతున్నది. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీతో పాటు మరికొన్ని ఇతర సంస్థల ఆస్తుల అమ్మకాన్ని వేగవంతం చేసేందుకు అనుమతించవద్దని పంజాబ్ నేషనల్ బ్యాంకు అమెరికాలోని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దాదాపు రూ.14 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, నీరవ్ తన సంస్థలను అమ్మితే ఆయన నుంచి బకాయిలను రాబట్టేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంకు న్యూయార్క్‌లోని కోర్టుకు వివరించినట్లు పేర్కొన్నది. నీరవ్ ఆధ్వర్యంలోని ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీతో పాటు ఆయనకు చెందిన మూడు అనుబంధ సంస్థలు గత నెల న్యూయార్క్‌లోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 హెచ్ఎస్బీసీ, ఐడీబీ మాత్రమే రుణాలిచ్చాయని నీరవ్ దివాలా పిటిషన్

హెచ్ఎస్బీసీ, ఐడీబీ మాత్రమే రుణాలిచ్చాయని నీరవ్ దివాలా పిటిషన్

నీరవ్ మోదీకి చెందిన ఈ కంపెనీలు తమ దివాలా పిటిషన్‌లో పీఎన్బీని రుణదాతగా పేర్కొనలేదు. అనుమతి లేకుండా నీరవ్ మోదీ రుణాలు పొందారన్న ఆరోపణతో పీఎన్బీ క్రిమినల్ కేసులు దాఖలు చేసిన విషయంతోపాటు తమ విదేశీ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేసేందుకు దారితీసిన కారణాలను ఫైర్‌స్టార్ ఆ పిటిషన్‌లో తెలిపింది. నీరవ్‌కు చెందిన రెండు సంస్థలకు హెచ్‌ఎస్‌బీసీ, ఐడీబీ (ఇజ్రాయెల్ డిస్కౌంట్ బ్యాంకు) మాత్రమే రుణాలిచ్చాయని, ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రుణాలు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.130 కోట్ల) రుణాలిచ్చాయని, ఐడీబీ కల్పించిన రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయానికి వ్యక్తిగతంగా నీరవ్, మరో రెండు కంపెనీలు గ్యారెంటీ ఇచ్చినట్లు దివాలా పిటిషన్‌లో పేర్కొన్నారు.

 నేటితో ముగియనున్న ఎల్వోయూల గడువు

నేటితో ముగియనున్న ఎల్వోయూల గడువు

ఇదిలావుంటే, తమ అధికారులు అక్రమంగా జారీ చేసిన అండర్‌టేకింగ్ లెటర్లు (ఎల్‌వోయూలు), ఫారిన్ క్రెడిట్ లెటర్ల (ఎఫ్‌ఎల్‌సీల) ఆధారంగా నీరవ్ మోదీతో పాటు ఆయన మామ మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలోని కంపెనీలకు దాదాపు రూ.6,500 కోట్ల రుణాలను ఇచ్చి మోసపోయిన ఏడు ఇతర బ్యాంకులకు ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. వీటిలో దాదాపు 350 ఎల్‌వోయూలు, ఎఫ్‌ఎల్‌సీల గడువు శనివారంతో ముగియనున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+