10 నిమిషాల డెలివరీ విధానం రద్దు.. కేంద్రం సంచలన ప్రకటన

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల భద్రత, పని ఒత్తిడి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేగవంతమైన డెలివరీ పేరుతో గిగ్ వర్కర్లపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇకపై బ్లింకిట్‌తో పాటు అన్ని క్విక్ కామర్స్ సంస్థలు "10 నిమిషాల్లో డెలివరీ" అనే ప్రకటనలు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

వాస్తవానికి, అతి తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే లక్ష్యాలు గిగ్ వర్కర్లపై తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని మోపుతున్నాయని కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాల్సిన పరిస్థితులు, రోడ్డు ప్రమాదాల ముప్పు, విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన ఒత్తిడి కారణంగా డెలివరీ పార్ట్‌నర్ల ప్రాణం ప్రమాదంలో పడుతోందని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.

Centre Puts Brakes on 10-Minute Delivery Model After Gig Workers Protests

గిగ్ వర్కర్ల ధర్నాలు, డిమాండ్లు

ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కొత్త ఏడాదికి ముందు డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు పలు నగరాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డెలివరీ సమయాన్ని నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కనీస వేతనం, పని గంటల పరిమితి, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, వైద్య సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లను కూడా గిగ్ వర్కర్లు ముందుకు తెచ్చారు.

డెలివరీ ఆలస్యమైతే విధించే పెనాల్టీలు, రేటింగ్ తగ్గింపులు తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేగం కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరసనల్లో గిగ్ వర్కర్లు ఆరోపించారు.

కేంద్రం తాజా ఆదేశాలు

ఈ ధర్నాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించి క్విక్ కామర్స్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను ఆకర్షించే ఉద్దేశంతో అతివేగ డెలివరీ హామీలను ప్రకటనల్లో ప్రదర్శించరాదని, డెలివరీ పార్ట్‌నర్ల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించింది. అలాగే, గిగ్ వర్కర్ల పని పరిస్థితులు మెరుగుపడేలా మార్గదర్శకాలు రూపొందించాలని, భవిష్యత్‌లో స్పష్టమైన నియంత్రణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

గిగ్ వర్కర్లకు ఊరట

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గిగ్ వర్కర్లకు తాత్కాలిక ఊరటగా మారింది. అతి తక్కువ సమయంలో డెలివరీ చేయాలన్న ఒత్తిడి తగ్గితే, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, పని భద్రత మెరుగవుతుందని గిగ్ వర్కర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని సంస్థలు ఎంతవరకు అమలు చేస్తాయన్నది కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+