వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లకు పడగలెత్తుతున్నారు: శరవేగంతో పెరుగుతున్న సంఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశంలో కోటీశ్వరుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది. వారి సంఖ్య ప్రస్తుతానికి 59,830 ఉంది. 2015-16 అంచనా సంవత్సరానికి సంబంధించి పన్నుల శాఖకు సమర్పించిన ఐటి రిటర్న్‌ల్లో ఆ విషయం తేలింది.

కోటి రూపాయలకు పైగా వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన వారి సంఖ్య అంతకుముందు ఏడాది కంటే 23.5 శాతం ఎక్కువగా ఉంది. ఐటి శాఖ అందించిన వివరాల ప్రకా రం.. కోటి రూపాలయ పైగా ప్రకటిత ఆదాయం ఉన్న వారు 59,830 మంది ఉన్నారు.

2015-16 అంచనా సంవత్సరం 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రిటర్న్స్‌తో సహా మొత్తం 4.35 కోట్ల రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఈ రిటర్న్‌ల్లోని మొత్తం ప్రకటిత రాబడి 33.62 లక్షల కోట్ల రూపాయలుంది. అంతకుముందు ఏడాది దాఖలైన రిటర్న్‌ల సంఖ్య 3.91 కోట్లు కాగా ప్రకటించిన రాబడుల మొత్తం 26.93 లక్షల కోట్ల రూపాయలు.

2015-16 అంచనా సంవత్సరం పన్ను రిటర్న్‌లకు సంబంధించిన గణాంకాలను ఐటి శాఖ విడుదల చేసింది. ఈ గణాంకాల్లోని విశేషాలు..

ఉమ్మడి రాబడి తగ్గింది..

ఉమ్మడి రాబడి తగ్గింది..

2015-16 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 59,830 మంది కోటీశ్వరుల ఉమ్మడి ఆదాయం 1.54 లక్షల కోట్ల రూపాయలు. వాస్తవానికి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే వీరి సంఖ్య పెరిగినా ఉమ్మడి రాబడి మాత్రం తగ్గింది.

గత సంవత్సరంతో పోలిస్తే..

గత సంవత్సరంతో పోలిస్తే..

అంతకుముందు సంవత్సరంలో అంటే 2014-15 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో కోటీశ్వరుల సంఖ్య 48,417 ఉండగా వారి ఉమ్మడి రాబడి మొత్తం 2.05 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఏడాది కాలంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగినా వారి ఉమ్మడి రాబడి దాదాపు 50,889 కోట్ల రూపాయల మేర తగ్గింది.

రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఇంతేదేశంలోని 120 కోట్ల జనాభాలో పన్ను రిటర్నులు ధాఖలు చేసిన వారి సంఖ్య 4.07 కోట్లు మాత్రమే ఉంది.ఇందులో 82 లక్షల మంది 2.5 లక్షల రూపాయల లోపు రాబడిని లేదా అసలు ఏ మాత్రం రాబడి లేదని రిటర్న్స్‌లో చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం 2.5 లక్షల రూపాయల లోపు రాబడికి పన్నులు వర్తిస్తుంది.

రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఇంతేదేశంలోని 120 కోట్ల జనాభాలో పన్ను రిటర్నులు ధాఖలు చేసిన వారి సంఖ్య 4.07 కోట్లు మాత్రమే ఉంది.ఇందులో 82 లక్షల మంది 2.5 లక్షల రూపాయల లోపు రాబడిని లేదా అసలు ఏ మాత్రం రాబడి లేదని రిటర్న్స్‌లో చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం 2.5 లక్షల రూపాయల లోపు రాబడికి పన్నులు వర్తిస్తుంది.

దేశంలోని 120 కోట్ల జనాభాలో పన్ను రిటర్నులు ధాఖలు చేసిన వారి సంఖ్య 4.07 కోట్లు మాత్రమే ఉంది.ఇందులో 82 లక్షల మంది 2.5 లక్షల రూపాయల లోపు రాబడిని లేదా అసలు ఏ మాత్రం రాబడి లేదని రిటర్న్స్‌లో చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం 2.5 లక్షల రూపాయల లోపు రాబడికి పన్నులు వర్తిస్తుంది.

ఆ సంఖ్య ఇలా ఉంది..

ఆ సంఖ్య ఇలా ఉంది..

2015-16 అసెస్ మెంట్‌ ఇయర్‌లో పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినవారి ఉమ్మడి రాబడుల మొత్తం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 18.41 లక్షల కోట్ల రూపాయల నుంచి 21.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.

వీరు ఇలా ఉన్నారు..

వీరు ఇలా ఉన్నారు..

పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారిలో దాదాపు 1.33 కోట్ల మంది 2.5 లక్షల రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయల రాబడి బ్రాకెట్లో ఉన్నారు. ఒకటి నుంచి ఐదు కోట్ల రూపాయల మధ్య రాబడి ప్రకటించిన వారి సంఖ్య 55,331 కాగా 5-10 కోట్ల రూపాయల మధ్య రాబడి ప్రకటించినవారి సంఖ్య 3,010 మాత్రమే.

అలా ప్రకటించిన ఒకే ఒక్కడు..

అలా ప్రకటించిన ఒకే ఒక్కడు..

10-25 కోట్ల రూపాయల మధ్య రాబడి ఉన్న వారి సంఖ్య 1,156 ఉండగా ఒకే ఒక వ్యక్తి 500 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ప్రకటించారు. ఆ వ్యక్తి రాబడి 721 కోట్లరూయలు ఉంది.
అంతకుముందు ఏడాది 500 కోట్ల రూపాయల పైబడిన రాబడి ఉన్న గ్రూప్‌లో ఏడుగురు ఉన్నారు. వారి ఉమ్మడి రాబడి 85,183 కోట్ల రూపాయలు.

వారు ఇంత మంది...

వారు ఇంత మంది...

100-500 కోట్ల రూపాయల రాబడి విభాగంలో మొత్తం 31 మంది ఉండగా వారి ఉమ్మడి రాబడుల మొత్తం 4175 కోట్ల రూపాయలుంది. అంతకుముందు ఏడాది వీరి సంఖ్య 17 ఉండగా వారి ఉమ్మడి రాబడి మొత్తం 2,761 కోట్ల రూపాయలు మాత్రమే.

English summary
Individuals with over Rs 1 crore of declared income rose 23.5 per cent to 59,830 in tax assessment year 2015-16, but the higher number of 'crorepatis' had Rs 50,889 crore less income than that of the previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X