ఎదురులేని ఎలక్ట్రిక్ బైక్స్. 2025 లో దుమ్ము లేపిన సేల్స్

2025 సంవత్సరం ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicle) వైపు మళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే ఈవీ మార్కెట్ ఊహించని మలుపు తిరిగింది. మరోవైపు వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో బ్రాండ్, రీసేల్, విశ్వసనీయత, సర్వీసింగ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందువలనే 2025 క్యాలెండర్ ఇయర్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల ఎలా జరిగాయో, ఏ కంపెనీ బైక్స్ ఎక్కువగా అమ్ముడు పోయాయో చూడండి.

గణాంకాల ప్రకారం 2025 లో టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ భారతదేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. గడిచిన ఏడాదిలో టీవీఎస్ దాదాపు 2.95 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి, మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.24.2 శాతం మార్కెట్ షేర్ తో టీవీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ ఎంట్రీ ఈ సంస్థకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.

రెండో స్థానంలో బజాజ్..

2025లో ఈవీ స్కూటర్స్ సేల్స్ లో బజాజ్ (Bajaj) సంస్థ రెండో స్థానంలో నిలిచింది. బజాజ్ సుమారు 21.9 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని, టీవీఎస్ తర్వాతి కొనుగోలుదారులు బజాబ్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా బజాజ్ ప్రసిద్ధ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విజయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది. కొత్త వేరియంట్లను తీసుకురావడంతో, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది.

Electric Two Wheeler Market in 2025 Brand Trust and Reliability Drive Sales Surge

డీలా పడిన ఓలా

2024లో ఈవీ మార్కెట్ ను షేక్ చేసిన ఓలా (OLA Bike) 2025లో మాత్రం తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది. వరుసగా బైక్స్ అగ్నిప్రమాదాలకు గురికావడంతో ఆ సంస్థ ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకుంది. 2025 చివరి నాటికి ఓలా తన మార్కెట్ వాటాలో సగానికి పైగా కోల్పోయి కేవలం 16.1 శాతానికి పరిమితమైంది. అమ్మకాల పరంగా చూస్తే, 2025లో ఓలా దాదాపు 1.97 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించింది

విశ్వాసాన్ని గెలుచుకున్న ఏథర్..

తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఏథర్(Ather scooter). 2025లో మంచి గ్రోత్ చూపించింది. ఏథర్ ఎనర్జీ తన మార్కెట్ వాటాను 2025 సంవత్సరంలో 11.3 శాతం నుంచి 16.2 శాతానికి పెంచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+