కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు
దేశ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. తాజా ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ లో వెండి మే ఫ్యూచర్స్ డెలివరీ కిలో రూ. 13,606 తగ్గింది. ఏకంగా ఆరు శాతం మేర పతనమైంది. ప్రస్తుతం రూ. 2,13,166 కు చేరింది. ఏప్రిల్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 7,115 తగ్గి రూ. 1,37,377 వద్ద ట్రేడ్ అయ్యింది. దాదాపు నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా సోమవారం బంగారం ధరలు రెండు శాతానికి పైగా పడిపోయాయి.
స్పాట్ గోల్డ్ 2.5 శాతం తగ్గింది. ఔన్స్‌కు 4,372.86 డాలర్లు పలుకుతోంది. జనవరి 2 తర్వాత కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోవడం వరుసగా తొమ్మిదో రోజు. నిజానికి కిందటి వారమే బంగారం ధర 10 శాతానికి పైగా క్షీణించింది. అదే సమయంలో, స్పాట్ వెండి కూడా బలహీనపడి, 3.2 శాతం పడిపోయి ఔన్స్‌కు 65.61 డాలర్లకు గత శుక్రవారం స్పాట్ మార్కెట్లో బంగారం 43 సంవత్సరాలలో అత్యధిక పతనాన్ని చూసి, 10 శాతానికి పైగా తగ్గి ఔన్స్‌కు 4,500 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది.

ఈ ఏడాది మొదట్లో గరిష్ట స్థాయిని తాకింది బంగారం ధర. జనవరి 29న 10 గ్రాములకు 1,93,096 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. నాటి రేట్ తో పోల్చుకుంటే దీని ధరలో 60,000 వరకు తగ్గుదల కనిపిస్తోంది. వెెండిదీ అదే పరిస్థితి. జనవరిలో 4,00,000 ను దాటింది వెండి కిలో ధర. ఇప్పుడు రూ.2,00,000 చేరువ అయింది. సగానికి పడిపోయింది. ఈ పతనానికి ఇక్కడితో బ్రేకులు పడే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేస్తోన్నారు.
డాలర్ ఇండెక్స్‌లోని హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరలు, కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం వంటి కారకాల వల్ల ఇంకొన్ని రోజుల పాటు బంగారం, వెండి ధరలు అస్థిరంగా ఉంటాయని ఫిన్ మార్ట్ ప్రతినిధి మనోజ్ కుమార్ జైన్ తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌కు 4,505 నుండి 4,440, వెండి 64.00 నుండి 60.00 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేశారు.
ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,000 వరకు క్షీణించవచ్చని పేర్కొన్నారు. వీటి రేట్లల్లో స్థిరత్వం ఏర్పడే వరకు కొనకపోవడం మంచిదని సూచించారు. చిన్న పెట్టుబడిదారులు ప్రస్తుత మార్కెట్ సద్దుబాటు కారణంగా ఎస్ఐపీ ద్వారా క్రమంగా కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. సాధారణంగా విపత్తులు, ప్రపంచ ఉద్రిక్తతల సమయంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. మధ్యప్రాచ్య యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ వాటి ధరలు పడిపోవడం గమనించదగ్గ విషయం.
ఈ అసాధారణ పతనానికి అనేక కారణాలు లేకపోలేదు. ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్ బలోపేతం కావడం ప్రధాన కారణాలు. ఇది విలువైన లోహాల మార్కెట్‌పై గణనీయమైన ఒత్తిడిని పెంచింది. ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని పెంచుతుంది. బలమైన డాలర్, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా లోహాలు పెరగకుండా నిరోధిస్తుంది. అధిక వడ్డీ రేట్లు, బలమైన డాలర్ బంగారం, పసిడి, వెండిని మరింత ఒత్తిళ్లకు గురి చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
పరుగులు పెడుతున్న పసిడి రేట్లు? -
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications