డాలర్ సెగ.. పసిడి దిగువ బాట: పండగ ముంగిట బంగారం ధరల్లో.. !!

పసిడి కొనుగోలుదారులకు బంగారం ధరలు ఎప్పుడూ పరీక్షను పెడుతూనే ఉంటాయి. ప్రత్యేకించి పండుగల సీజన్ సమీపిస్తున్న కొద్దీ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంటాయి. అంతర్జాతీయంగా ఏర్పడే ఒడిదుడుకులు, అమెరికా డాలర్ విలువ స్థిరత్వం, దేశీయ డిమాండ్ వంటి అనేక రూపాల్లో మార్కెట్ గణాంకాలు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి ఊహించని విధంగా క్షీణిస్తుంటాయి.

ఈ హెచ్చుతగ్గులు.. బంగారాన్ని కొనాలనుకునే వారికి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంటాయి. కిందటి వారం ఇవే పరిణామాలు చోటు చేసుకున్నాయి.. దేశీయ బులియన్ మార్కెట్ లో. ఇప్పుడు అందరి చూపూ.. ఈ వారంలో వీటి రేట్లు ఎలా ఉండొచ్చనే అంచనాల మీదే ఉన్నాయి. ఈ వారం కూడా ఒడిదుడుకులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. వెస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు దీనికి కారణాలు కానున్నాయి.

Gold and silver prices in India remained unchanged across 24K 22K and 18K now eyes next week

కిందటి వారం బంగారం, వెండి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. పసిడి, వెండి ధరలు సరికొత్త గరిష్టాల వైపు దూసుకెళ్లాయి. కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ రెండింటి ధరలు భారీ లాభాలతో పరుగులు పెట్టాయి.

సాగరాలు దాటిన భారత కీర్తి: స్వీడన్ ఎంపీగా గెలిచిన బీజేపీ మంత్రి మేనకోడలి కథేంటి?
సాగరాలు దాటిన భారత కీర్తి: స్వీడన్ ఎంపీగా గెలిచిన బీజేపీ మంత్రి మేనకోడలి కథేంటి?

ఎమ్‌సీఎక్స్‌లో అక్టోబర్ 5వ తేదీ నాటి గోల్డ్ ఫ్యూచర్స్ 0.83 శాతం లాభ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,940 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అదే క్రమంలో డిసెంబర్ 4 నాటి సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు మరింత దూసుకెళ్లాయి. కిలో వెండి ధర ఏకంగా 1.22 శాతం పెరిగింది. 2,41,100 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ మధ్యకాలంలో వెండి ధరలు ఈ స్థాయికి చేరుకోవడం, వీటి రేట్లు భారీగా పెరగడం ఇదే మొదటిసారి.

బంతి ఇక డొనాల్డ్ ట్రంప్ కోర్టులో..: 7 షరతులు
బంతి ఇక డొనాల్డ్ ట్రంప్ కోర్టులో..: 7 షరతులు

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,584, 22 క్యారెట్లు - రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 12,055

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+