రియాద్ విమానాశ్రయంపై హౌతీల డ్రోన్ దాడి..! దట్టమైన పొగ.. నిలిచిపోయిన సేవలు
సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద భారీగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయంలోని ఇంధన నిల్వ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగతో నిండిపోయింది. ఆకాశాన్ని తాకే విధంగా బ్లాక్ స్మోగ్ రావడంతో విమాన ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఇక ఈ ప్రమాదానికి కారణం యెమెన్ లోని హౌతీల డ్రోన్ దాడులేనని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ నివేదించింది. తాజాగా రియాద్ లో రెండోసారి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సమయానికే ఇలా విమానాశ్రయంపై దాడులు జరగడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానాల ప్రయాణాల్లో లాంగ్ డిలే లు, క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి. అలాగే బీబీసీ కథనం ప్రకారం కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలిపింది. మరో కథనం ప్రకారం.. ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఫ్యూయల్ ట్యాంక్ కు మంటలు అంటుకుని దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై సౌదీ యంత్రాంగం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ దాడిలో ధ్వంసం అయిన ఆయిల్ ట్యాంకర్ సౌదీలోని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఆరామ్ కో అని స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని ఘటనాస్థలిలోని ప్రత్యక్ష సాక్షి ఏఎఫ్పీ జర్నలిస్టు వెల్లడించారు.
అలాగే ఏఎఫ్ పీ మీడియాకు స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రమాద హెచ్చరికలు జారీ అయిన తర్వాత వరుసగా పేలుడు శబ్దాలను తమకు వినిపించాయని.. తాము భయాందోళన చెందామని అన్నారు. విమానాశ్రయం పైన దట్టమైన పొగ అలుముకుందని తెలిపారు. ఇక తాజా ఘటనతో సౌదీ అరేబియా అలాగే హౌతీల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం యెమెన్ లోని అత్యధిక భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న హౌతీలు.. తమ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వ ఏర్పాటు కోసం పోరాడుతున్నాయి. అంతకుముందు హౌతీ మిలిటరీ అధికార ప్రతినిధి యహ్య- అల్ సరియా మాట్లాడుతూ యెమెన్ పై సౌదీ అరేబియా 300 లకు పైగా దాడులు చేసిందని అన్నారు. అలాగే యెమెన్ రాజధాని సనాపైనా దాడులు చేసినట్లు ఈ దాడులను చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా రియాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు జరగడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications
