కేజ్రీవాల్‌, ఆయన ఫ్యామిలీకి SIR నోటీసులు.. ఈసీపై ఆప్ ఫైర్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. సర్ ప్రక్రియలో భాగంగా దిల్లీ ఓటర్ జాబితాకు సంబంధించి ఆయన కుటుంబంలోని ఐదుగురికి దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వీరిలో కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ అలాగే తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవి ల పేర్లు ఉన్నాయి. అయితే ఇదే విషయంలో ఎన్నికల సంఘంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది.

దిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ జీ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు దిల్లీ ఓటరు జాబితాలో లేకపోవడం ఎలా సాధ్యం..? అని ప్రశ్నించింది. దేశంలో జరుగుతున్న ప్రతీ అంశం సుప్రీం లార్డ్ ను సంతోష పెట్టేందుకేనా..? అంటూ ఎద్దేవా చేసింది. ఇక కేజ్రీవాల్ ఫ్యామిలీ మొత్తం మరోసారి ఎన్నికల అధికారుల ముందు హాజరై ఓటు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక కేజ్రీవాల్ న్యూదిల్లీ- 40 అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటరుగా ఉన్నారు.

Kejriwal and his family SIR notices issued AAP party lashes out atthe EC delhi sir latest viral now

మరోవైపు దిల్లీలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో వివరాలకు సంబంధించి అవకతవకలు ఉన్న మొత్తం 33.1 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అటు దిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అయితే ఆమె వివరాలు, పత్రాలను పరిశీలించిన తర్వాత ఓటరు నమోదు చెల్లుబాటు అయిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా గత సర్ తో వివరాలు మ్యాప్ కాకపోవడం కారణంగా నోటీసులు అందుకున్నారు. ఇక మాజీ దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా, ఆయన భార్య, సోదరుడికి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక సర్ ప్రక్రియలో తుది ఓటరు జాబితాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+