Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!!

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ప్రపంచానికే తెలుసు. కానీ, ఇప్పుడు అసోచామ్ (ASSOCHAM) వెల్లడించిన నివేదికలోని గణాంకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే, భారతీయ గృహిణుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు..అదొక సెంటిమెంట్,ఒక భరోసా.అయితే ఈ భరోసా ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి చేరుకుంది.అసోచామ్ తాజా నివేదిక ప్రకారం,భారతీయ ఇళ్లల్లో ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే ఎక్కువగా ఉన్నాయని తేలింది.

gold-news-indian-households-hold-25-000-tonnes-gold-more-than-worlds-top-central-banks-assocham-repo

బ్యాంకులను మించిన ఇంటి నిల్వలు

అమెరికా,జర్మనీ,ఇటలీ,ఫ్రాన్స్ వంటి టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) భారీగా బంగారాన్ని నిల్వ ఉంచుతాయి. అయితే, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం సుమారు 25,000 నుండి 27,000 టన్నుల మధ్య ఉంటుందని అంచనా.అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) వద్ద ఉన్న నిల్వలు సుమారు 8,133 టన్నులు.జర్మనీ వద్ద 3,350 టన్నులు మాత్రమే ఉన్నాయి.కానీ, ఒక్క భారతీయ గృహిణుల వద్దే ప్రపంచ దేశాలన్నింటినీ మించిన పసిడి నిధి ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

పరుగులు పెడుతున్న పసిడి రేట్లు?
పరుగులు పెడుతున్న పసిడి రేట్లు?

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారు నిల్వలు కలిగి, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది.అయితే,గృహాల్లో ప్రైవేటుగా నిల్వ ఉన్న బంగారం అధికారిక నిల్వలను చాలా వరకు మించి, ప్రపంచంలో ఏ ఇతర దేశంతో పోల్చినా అత్యధికంగా ఉంది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద బంగారు ఆభరణాల వినియోగదారుగా కొనసాగుతోంది.

పసిడిపై ఎందుకంత మక్కువ..?

ఆర్థిక మాంద్యం వచ్చినా, కరోనా వంటి విపత్తులు ఎదురైనా భారతీయులు మొదట నమ్మేది బంగారాన్నే.దీనిని 'లిక్విడ్ క్యాష్'గా భావిస్తారు.భారత్‌లో బంగారం ఒక తరం నుండి మరో తరానికి బహుమతిగా అందుతుంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో సగటున 30% నుండి 50% ఖర్చు బంగారం కొనుగోలుకే కేటాయిస్తారు.గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికే ప్రజలు మొగ్గు చూపుతారు. భారత్‌లో అమ్ముడయ్యే బంగారంలో 60% పైగా గ్రామీణ ప్రాంతాల నుండే డిమాండ్ ఉంటుంది.బంగారం వినియోగంలో చైనాతో భారత్ ఎప్పుడూ పోటీ పడుతుంటుంది. కానీ,నిల్వ ఉంచుకోవడంలో మాత్రం భారతీయులదే అగ్రస్థానం అని చెప్పొచ్చు.

 మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్

ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్..

ప్రజల వద్ద ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉండటం ఒక రకమైన 'డెడ్ ఇన్వెస్ట్‌మెంట్'అని ఆర్థిక నిపుణులు భావిస్తుంటారు. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఇంటి వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి వడ్డీ పొందేలా ప్రోత్సహిస్తోంది.గృహ బంగారంలో కేవలం 2 శాతాన్ని మాత్రమే ఆర్థిక ఆస్తులుగా మార్చగలిగినా,2047 నాటికి భారత్ GDP కి అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు జోడించవచ్చని అసోచామ్ అంచనా వేసింది.భారత్ GDP 2047 నాటికి 34 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేయబడింది. బంగారు ఆదాయం జోడిస్తే ఇది 40 లక్షల కోట్ల డాలర్లను దాటవచ్చు .అంటే 2047 నాటికి భారత్ ఆర్థిక శక్తి మరింత పటిష్టంగా మారుతుంది.

ప్రపంచ దేశాల బ్యాంకులు తమ ఆర్థిక స్థితిగతులను కాపాడుకోవడానికి బంగారాన్ని నిల్వ చేస్తే.. భారతీయ గృహిణులు తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆ బంగారాన్ని భద్రపరుస్తున్నారు.ఇది భారత్ దాచుకున్న అతి పెద్ద ఆర్థిక రహస్యం.దేశంలోని ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి రిజర్వ్ బ్యాంక్ అని అసోచామ్ నివేదిక మరోసారి నిరూపించింది. పసిడిపై భారతీయులకు ఉన్న ఈ అచంచలమైన నమ్మకమే దేశ ఆర్థిక వ్యవస్థను ఎటువంటి సంక్షోభంలోనైనా పడకుండా కాపాడుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+