బంగారం ధరల షాక్.. కొనాలంటే కష్టమే.. ఏపీ, తెలంగాణాలో లేటెస్ట్ రేట్స్ ఇలా!
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనుగోలు చేయాలని చాలామంది పసిడి ప్రియులు బంగారం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఊహించని విధంగా ఆగస్టు మాసంలో పసిడి ప్రియులకు బంగారం ధరల షాక్ తగులుతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి బంగారం ధరల పెరుగుదల కనిపిస్తోంది. జూలై నెలలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన బంగారం ధరలు ఆగస్టు మొదటి వారంలో ఊహించని విధంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి.
పెరుగుతున్న బంగారం ధరలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో డాలర్ ప్రభావితం అవడం, యూకే విధిస్తున్న సుంకాలు వెరసి బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా డాలర్ బలం పుంజుకుంటే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ విపణిలో బంగారం ధరలకు డాలర్ విలువకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ ఉద్రిక్తతల మధ్య మార్పులకు లోనవుతున్న బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలిలా
ఇక నేడు బంగారం ధరల విషయానికొస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 1,02,380 రూపాయల ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,860 రూపాయలు పలుకుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 1,02,230 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,710 రూపాయలు పలుకుతోంది.
హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలిలా
ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,02,230 రూపాయలు పలుకుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,710 రూపాయలు వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,02,230 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,710 రూపాయలుగా కొనసాగుతుంది.
బంగారం ధరలు పెరిగే అవకాశం.. జాగ్రత్త
అయితే ఈ వారంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు భారీగా పెరుగుతాయని, ఇప్పుడు బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications