భారీగా దిగొచ్చిన వెండి! బంగారం ధరకు బ్రేక్స్..

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, భూరాజకీయ ఆందోళనల కారణంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్ గత కొన్ని రోజులుగా తీవ్ర తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యం పసిడి ధరల్లో ఊహించని తీవ్రమైన హెచ్చుతగ్గులకు కారణమైంది. రోజుకో రీతిలో మారుతున్న ధరలతో అటు సామాన్య కొనుగోలుదారులు, ఇటు పెట్టుబడిదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అయితే, ఈ అనిశ్చితి వాతావరణం మధ్య నేడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మారకుండా స్థిరంగా కొనసాగడం పసిడి ప్రియులకు కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తోంది.

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల వివరాలు

గురువారం నాటి ట్రేడింగ్ వివరాలను గమనిస్తే.. మన దేశంలో 24 క్యారట్ల చొక్కటైన గ్రాము బంగారం ధర రూ.14,395 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.13,195గా ఉంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.10,796 వద్ద నమోదైంది. ఇదే క్రమంలో బల్క్ కొనుగోలుదారుల కోసం చూస్తే, 100 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ.14,39,500 కాగా, 22 క్యారట్ల 100 గ్రాముల ధర రూ.13,19,500గా స్థిరపడింది. 18 క్యారట్ల 100 గ్రాముల బంగారం రూ.10,79,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Price Today 24K 22K Rates Hold Flat Across India Silver Falls Down By Rs 5000 Per KG
లాభాల పంట పండిస్తోన్న పసిడి రేట్లు- తగ్గేదే లేదు
లాభాల పంట పండిస్తోన్న పసిడి రేట్లు- తగ్గేదే లేదు

ప్రముఖ నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు

దేశంలోని ప్రధాన నగరాల వారీగా 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే, ఎక్కువ ప్రాంతాల్లో ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: ఈ నగరాల్లో 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,950 కాగా, 22 క్యారట్ల ధర రూ.1,31,950, ... 18 క్యారట్ల ధర రూ.1,07,960 వద్ద నమోదయ్యాయి.
  • ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా: ఇక్కడ కూడా 24 క్యారట్లకు రూ.1,43,950, 22 క్యారట్లకు రూ.1,31,950, అలాగే 18 క్యారట్లకు రూ.1,07,960 చొప్పున ధరలు పలికాయి.
  • ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,100 గాను, 22 క్యారట్లు రూ.1,32,100 గాను, 18 క్యారట్ల ధర రూ.1,08,110 గాను నమోదు కావడం గమనార్హం.
  • అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో 24 క్యారట్ల ధర రూ.1,44,000, 22 క్యారట్లు రూ.1,32,000... 18 క్యారట్లు రూ.1,08,010 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలో పురోగమనం- దీపావళి నాటికి.. !!
బంగారం ధరలో పురోగమనం- దీపావళి నాటికి.. !!

హైదరాబాద్‌లో దిగొచ్చిన వెండి ధరలు

మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ప్రియులకు తీపి కబురు అందింది. గత కొన్ని రోజులుగా పరుగులెత్తిన వెండి ధర ఇవాళ భారీగా దిగివచ్చింది. ఒక్కరోజే కేజీ వెండిపై రూ.5,000 వరకు తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద నమోదైంది. పసిడి ధరలు స్థిరంగా ఉండటం, వెండి తగ్గడంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+