బంగారం కొనాలనే ప్లాన్ ఉందా?
నేడు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా వీటి రేట్లు ప్రభావితం చేశాయి. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఈ పెరుగుదల చోటు చేసుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ప్రారంభమయ్యాయి. ఎంసీఎక్స్ లో ఆగస్టు డెలివరీ పసిడి ఫ్యూచర్స్ 0.13 శాతం పెరుగుదలతో జోరందుకుంది. 10 గ్రాములకు 1,59,449 వద్ద ప్రారంభమైన పసిడి ట్రేడింగ్ ఆ తర్వాత కూడా ఊపందుకుంది.
సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే ఈ ధరలో పెరుగుదల కనిపించింది. గత ముగింపు ధర రూ. 1,59,241 కాగా.. ఈ ఉదయం 1,59,449 రూపాయల వద్ద ట్రేడింగ్ సెషన్ ఆరంభమైంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల ఫలితంపై పెట్టుబడిదారులు స్పష్టత కోసం ఎదురుచూస్తుండగా వాటిపై వాస్తవ పరిస్థితులకు భిన్నమైన నివేదికలు వెలువడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,57,030, 22 క్యారెట్లు రూ. 1,43,940, 18 క్యారెట్లు రూ. 1,17,770గా నమోదయ్యాయి. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, పూణే వంటి ఆరు మెట్రో నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ. 15,621, 22 క్యారెట్లు రూ. 14,319, 18 క్యారెట్లు రూ. 11,716గా ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 15,817, 22 క్యారెట్లు రూ. 14,999, 18 క్యారెట్లు రూ. 12,179గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ. 15,636, 22 క్యారెట్లు రూ. 14,334, 18 క్యారెట్లు రూ.11,731గా స్థిరంగా ఉంది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువలోని హెచ్చుతగ్గుల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడులుగా పరిగణించే పసిడి, వెండి రేట్లు పెద్దగా పుంజుకుంటోన్నాయి. గోల్డ్ కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. పెట్టుబడిదారుల్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications