లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో బ్యాంక్ స్కామ్! రూ.583 కోట్లు ఫట్
కంచే చేను మేసిన చందంగా.. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకు మేనేజరే 'కిలాడీ' అవతారమెత్తాడు. సినిమాల్లో కనిపించే హై-ప్రొఫైల్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా, ఏకంగా రూ. 590 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన ఈ భారీ స్కామ్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) చండీగఢ్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఈ 'వైట్ కాలర్' దోపిడీ కథనం ఆద్యంతం ఉత్కంఠభరితం. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు రహస్యాలు షాక్ కు గురిచేస్తున్నాయి
ఈ కథలో విలన్ మరెవరో కాదు, అదే బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన రిభవ్ రిషి. అతడికి తోడుగా రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్ చేతులు కలిపాడు. వీరు తమ ఉద్యోగాలకు ఆరు నెలల ముందే రాజీనామా చేసినా, తాము వెళ్లే లోపే బ్యాంకులో 'పెద్ద స్కెచ్' వేశారు. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు రూ. 590 కోట్ల నిధులను అత్యంత చాకచక్యంగా దారి మళ్లించారు. ఆ నిధులను తన భార్య స్వాతి, బావమరిది అభిషేక్ పేరిట ఉన్న 'స్వాస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్' అనే సంస్థ ఖాతాల్లోకి చేరవేశారు.

IDFC గుట్టు రట్టయింది ఇలా..
అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో నిందితుల ప్లాన్‌ను ఒక చిన్న పొరపాటు తలకిందులు చేసింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం తమ ఖాతాను మూసివేయాలని కోరుతూ, బ్యాలెన్స్ మొత్తాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేయాలని కోరింది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బ్యాంక్ అధికారులు రికార్డులు పరిశీలిస్తే.. ఉండాల్సిన బ్యాలెన్స్‌కు, వాస్తవంగా ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య భారీ తేడా కనిపించింది. ఆరా తీస్తే సుమారు రూ. 590 కోట్లు మాయమైనట్లు తేలడంతో బ్యాంకు యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కుటుంబమే ఒక ముఠా!
హర్యానా యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో కేవలం ఉద్యోగులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములని తేలింది. రిభవ్ రిషి తన భార్య, బావమరిది సహాయంతో ప్రభుత్వ నిధులను మళ్లించడమే కాకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అయితే, ఏసీబీ అధికారులు వీరి నెట్‌వర్క్‌ను ఛేదించి నలుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు.
బ్యాంకు సాహసోపేత నిర్ణయం
సాధారణంగా ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు విచారణ పూర్తయ్యే వరకు బ్యాంకులు బాధితులకు నగదు చెల్లించవు. కానీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఇక్కడ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. తమ బ్రాంచ్ ఉద్యోగుల తప్పిదానికి ఖాతాదారులైన ప్రభుత్వ విభాగాలు ఇబ్బంది పడకూడదని భావించి, వడ్డీతో కలిపి రూ. 583 కోట్లను తక్షణమే హర్యానా ప్రభుత్వానికి తిరిగి చెల్లించేసింది. కేవలం 24 గంటల్లోనే నిధులు రికవరీ కావడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications