మద్యం మార్కెట్ ను షేక్ చేస్తున్న భారత్ బ్రాండ్ విస్కీ.

ఇండియాను సైలెంట్ గా రూల్ చేస్తుంది లిక్కర్ బిజినెస్. ఒకప్పుడు ఫారన్ సరకుకు బాగా డిమాండ్. లోకల్ అంటే చీప్ గా చూసేవాళ్లు. కానీ రోజులు మారుతున్నాయి. దేశీ సరుకుకే జై కొడుతున్నారు భారతీయులు. అయితే ఈ సంవత్సరంలో మద్యం మార్కెట్ ఎలా నడిచింది. విదేశీ బ్రాండ్ల హవా ఎందుకు తగ్గింది. దేశీయ బ్రాండ్ల హవా ఎందుకు పెరిగింది. కిక్కుస్తున్న టాప్ విస్కీ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్, రియల్ ఎస్టేట్ వంటి వాటిపై పెడుతుంటారు.. కానీ సైలెంట్ గా షేర్ మార్కెట్ ను షేక్ చేస్తుంది లిక్కర్ షేర్స్. స్కాట్లాండ్ నుండి జపాన్ వరకు ఉన్న దిగ్గజ బ్రాండ్లకు చుక్కలు చూపిస్తూ.. మన దేశీ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్‌లో కింగ్ లా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ విస్కీని ఇండియా మాత్రమే తయారు చేయగలదు అనే రేంజ్ కు మన లిక్కర్ వచ్చేసింది. ఈ మాటను స్వయంగా విదేశీయులే ఒప్పుకుంటున్నారు. ఒక్క పెగ్గు పెడితే మొత్తం బయటకు వస్తుందంటే ఏ రేంజ్ లో కిక్కేక్కుతుందో మనందరికి తెలిసిందే.

India s Liquor Business Boom How Desi Whisky Brands Are Dominating the Market

అయితే మందు వెంటనే పనిచేస్తే కల్తీ అని..స్మూత్ గా ఎక్కితే మంచిదనే అపోహలు చాలానే ఉన్నాయి మనదేశంలో. ఎది ఎలా పోయినా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు, మరో వైపు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి మన లిక్కర్ బ్రాండ్స్. ఈ క్రమంలోనే మద్యం చేస్తున్న బిజినెస్ మ్యాజిక్' ఏంటి? మన విస్కీ బ్రాండ్లు ప్రపంచాన్ని ఎలా రూల్ చేస్తున్నాయి? ఈ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం!

ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు..

ఇండియాలో ఫస్ట్ సింగిల్ మాల్ట్ విస్కీ 'అమృత్' (Amrut). దీన్నీ జగదలే కుటుంబం ప్రారంభించింది. ఒక దశలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. అప్పట్లో భారతీయ విస్కీకి అంతర్జాతీయ గుర్తింపు లేదు. అసలు ఇండియా అంటేనే నాటు సారా బ్యాచ్ గా చూసేవాల్లు. ప్రజల వద్ద డబ్బు కూడా ఉండేది కాదు. తాగడానికి ఆస్తులమ్మే వారు. కాబట్టీ దేశీయంగా కూడా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. కానీ, గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లిక్కర్ సేల్స్ ప్రభుత్వాలకు కనక వర్షం కురిపిస్తున్నాయని.. అందుకే మద్యపాన నిషేధం అనే మాట ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లడలేని పరిస్థితి. పైగా మద్యంపైనే ముడుపులు కూడా బాగా అందుకుంటున్నారు.

2030 నాటికి 1 బిలియన్ డాలర్ల బిజినెస్..

2025 నాటికి భారతదేశపు దేశీయ మద్యం మార్కెట్ విలువ రూ.3.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ప్రతి ఏటా 10% వృద్ధితో దూసుకెళ్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారతీయ బ్రాండ్లు జెండా పాతతున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్పిరిట్స్ విభాగంలో భారతీయ బ్రాండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, గత ఏడాది భారతీయ మద్యం ఎగుమతులు రూ.3,000 కోట్లు దాటగా.. 2030 నాటికి ఇది 1 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 8,500 కోట్ల మార్కును చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గకూడదనే ఆలోచన

ప్రస్తుతం భారతీయ యువతలో ఎక్కువగా వినిపించే మాట రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గకూడదని.. అలాగే 'తక్కువ తాగినా.. నాణ్యమైనది తాగాలిని. దీనివల్ల కంపెనీలు సామాన్య బ్రాండ్ల కంటే ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ మార్జిన్ పొందుతున్నాయి. హర్యానాకు చెందిన 'ఇంద్రి' (Indri) లిక్కర్ బిజినెస్ ను షేక్ చేసి పడేసింది. అతి తక్కువ కాలంలోనే 'వరల్డ్ బెస్ట్ విస్కీ' (World's best whisky) అవార్డులు సాధించి ఇండియా బ్రాండ్ విస్కీకి గ్లోబెల్ రేంజ్ ను సులభంగా దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా పెట్టుబడల వెల్లవ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+