యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ 2 రాష్ట్రాలకు భారీ ప్రయోజనం

India-UK FTA: భారత్, యునైటైడ్ కింగ్‌డమ్(UK)కు నేడు(గురువారం) చారిత్రాత్మక దినం. భారత్ మొదటిసారిగా ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా వాణిజ్యం నిర్వహించే వాణిజ్య భాగస్వామిని పొందింది. రెండు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)పై సంతకాలు చేసి దానిని అమలులోకి తెచ్చాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ, దీని వల్ల దేశంలోని 2 రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ రాష్ట్రాల్లో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది.

భారత్, యూకే మధ్య సుంకాలు లేకుండా వాణిజ్యం ప్రారంభం కావడంతో భారతీయ రొయ్యలకు డిమాండ్ పెరుగుతుంది. దీని వల్ల బ్రిటన్‌లోని 50 వేల కోట్ల రూపాయల సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు ప్రవేశం మరింత పెరుగుతుంది. ఇండియాలో రొయ్యల ఉత్పత్తి అనేక తీరప్రాంత రాష్ట్రాల్లో జరుగుతుంది, అయితే అత్యధిక ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. ఈ రాష్ట్రం దేశంలోని మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 50 నుంచి 60 శాతం ఉత్పత్తి చేస్తుంది. రెండో స్థానంలో ఒడిశా ఉంది. ఇది మొత్తం ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రొయ్యలను ఉత్పత్తి చేస్తుంది. యూకే మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్ పెరిగితే ఈ రెండు రాష్ట్రాలకే అత్యధిక ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు.

India-UK Free Trade Deal Signed Big Boost for Andhra Pradesh and Odisha Shrimp Exports

స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
యూకే, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత 99 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకున్నాయి. ఇందులో అనేక రకాల సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో రొయ్యల వాటా అత్యధికం. యూకేలో సముద్ర ఉత్పత్తుల మార్కెట్ దాదాపు రూ.50 వేల కోట్లు, ఇక్కడ భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు సులభంగా పోటీ పడగలవు. తమ ఉత్పత్తుల లభ్యతను కూడా పెంచుకోగలవు. ఇండియా నుంచి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఘనీభవించిన రొయ్యలు యూకేకు ఎగుమతి అవుతాయి.

భారత్ రొయ్యలను ఎగుమతి ఎంత?
2023-24లో భారత్ యూకేకు 50 నుంచి 70 వేల టన్నుల రొయ్యలను ఎగుమతి చేసింది. అయితే ఇండియా మెత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతి 1,781,602 టన్నులు. ఇందులో 7.16 లక్షల టన్నులు కేవలం రొయ్యలు మాత్రమే. ఇది మొత్తం సముద్ర ఉత్పత్తులలో దాదాపు 40 శాతం కాగా, విలువ పరంగా 66 శాతం. ఇండియా ప్రతి సంవత్సరం 40 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. దీనిలో అత్యధికంగా అమెరికాకు దాదాపు 3 లక్షల టన్నులు, చైనాకు 1.48 లక్షల టన్నులు, యూరోపియన్ యూనియన్‌కు 90 వేల టన్నులు ఎగుమతి అవుతాయి.

ప్రస్తుతం రొయ్యలపై ఎంత సుంకం ఉంది?
ప్రస్తుతం యూకే భారతీయ సముద్ర ఉత్పత్తులపై 8 శాతం కంటే ఎక్కువ సుంకం విధిస్తుంది. రొయ్యలపై యూకే సుంకం 8.5 శాతం వరకు ఉంది. ఎఫ్‌టీఏ తర్వాత ఈ సుంకం పూర్తిగా తొలగిపోతుంది. దీని వల్ల ఉత్పత్తిదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి రొయ్యలు అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఈ రాష్ట్రాలకు యూకేలోని 50 వేల కోట్ల రొయ్యల మార్కెట్ ప్రయోజనాన్ని పొందే అవకాశం మరింత పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+