రూపాయికి షాక్.. తిరగబడిన డాలర్

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన భారతీయ కరెన్సీ రూపాయి.. ఇవాళ మరోసారి బలహీనపడింది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు కోల్పోయి 94.50 స్థాయికి పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటుండటంతో రూపాయి పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో రూపాయి 94.47 వద్ద ట్రేడవ్వడం మొదలై, కొద్దిసేపటికే మరింత క్షీణించి 94.50కి చేరుకుంది.

మార్కెట్‌ను దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న మందగమనం, అంతర్జాతీయంగా క్రూడాయిడ్ ధరలు ఎగబాకడం రూపాయి విలువను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.58 శాతం పెరిగి 110.54 డాలర్లకు చేరుకుంది. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఉదయం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 642.51 పాయింట్లు పడిపోయి 73,067.18 వద్ద కొనసాగగా, నిఫ్టీ కూడా 241.35 పాయింట్లు నష్టపోయి 22,570.90 వద్ద ట్రేడవుతోంది.

Indian Rupee Falls 12 Paise To 94 50 Against US Dollar As Stock Market Declines And Crude Oil Prices Rise
రూపాయి రయ్‌రయ్.. జియో తెచ్చిన భారీ లక్!
రూపాయి రయ్‌రయ్.. జియో తెచ్చిన భారీ లక్!

డాలర్ బలహీనతతో కొంత ఊరట

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ ఇండెక్స్ 0.21 శాతం క్షీణించి 101.56 వద్ద ట్రేడవుతుండటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పడిపోవడం రూపాయికి కొంత వరకు రక్షణ కల్పిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతకుముందు బుధవారం నాడు రూపాయి ఏకంగా 53 పైసలు బలపడి 94.38 వద్ద ముగిసినప్పటికీ, గురువారం ఉదయం మళ్లీ ప్రతికూల వాతావరణం ఎదురైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మాత్రం బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 1,022.32 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రూపాయికి నవరాత్రి పూనకాలు.. ఒక్క వారంలోనే సుడి తిరిగింది
రూపాయికి నవరాత్రి పూనకాలు.. ఒక్క వారంలోనే సుడి తిరిగింది

రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు?

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఐపీవోల ద్వారా దేశానికి వస్తున్న విదేశీ నిధులు, డాలర్ మారకం విలువలో స్వల్ప బలహీనత రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రష్యా శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్లు వస్తున్న వార్తలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుదల రూపాయికి మద్దతుగా నిలుస్తాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే క్రూడాయిడ్ ధరలు గనుక రాబోయే రోజుల్లో 120 డాలర్ల మార్కు వైపు దూసుకెళ్తే మాత్రం రూపాయి మారకం విలువపై తీవ్ర ఒత్తిడి తప్పదని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+