20 ఏళ్ల పండుగ వేళ 20 వేల ఫ్రీ టికెట్లు..
దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ 'ఇండిగో' ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజయవంతంగా 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 'హ్యాపీ ఇండిగో డే' వేడుకల్లో భాగంగా ఏకంగా 20,000 ఉచిత విమాన టికెట్లను ప్రయాణికులకు అందించేందుకు సిద్ధమైంది. 'ఇండిగో ఫ్రీ' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
మూడేళ్ల పాటు ఆఫర్ విండో.. బుకింగ్స్ ఎక్కడ చేసుకోవాలంటే?
ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు చేసుకునే దేశీయ విమాన బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా వారి వర్చువల్ అసిస్టెంట్ '6Eskai' ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వన్-వే లేదా రిటర్న్ జర్నీలతో పాటు ఎకానమీ క్లాస్, ఇండిగో స్ట్రెచ్ బుకింగ్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

ఉచిత టికెట్ ఎలా సొంతం చేసుకోవాలి?
ఆఫర్ వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకున్న వారి నుంచి కంపెనీ లక్కీ డ్రా విధానంలో విజేతలను ఎంపిక చేస్తుంది. ఎంపికైన లక్కీ విజేతలకు ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తారు. వారికి ఒక సులభమైన ప్రశ్నను కేటాయిస్తారు. మూడు ప్రయత్నాల్లో ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినట్లయితే.. వారు టికెట్ కోసం చెల్లించిన పూర్తి మొత్తం రిఫండ్ రూపంలో తిరిగి వారి ఖాతాలో పడిపోతుంది. ఒక్కో PNR పై గరిష్టంగా రూ.10,000 వరకు రిఫండ్ ఇస్తారు. విమాన ప్రయాణం ఉచితంగా మారడమే కాకుండా 3 నుంచి 5 రోజుల్లో ఈ రిఫండ్ ప్రాసెస్ పూర్తవుతుంది.
20 ఏళ్ల ప్రయాణం.. సామాన్యుడికి ఆకాశమే హద్దు!
ఒకప్పుడు చిన్న విమాన సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇండిగో, నేడు 400 కంటే ఎక్కువ విమానాలతో భారత ఆకాశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా అవతరించింది. సామాన్యులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే కాకుండా, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలను విస్తరించింది. రెండు దశాబ్దాల కస్టమర్ల నమ్మకానికి ప్రతీకగానే ఈ 20,000 ఉచిత టికెట్ల కానుకను అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది














Click it and Unblock the Notifications