అక్షయ తృతీయ ఎఫెక్ట్: బంగారం కొనుగోలులో 20 శాతం వరకు పెరుగుదల

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ రోజు బంగారం కొనడం చాలామందికి ఆనవాయితీ. దీంతో ఆభరణాల కొనుగోలు భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.

అక్షయ తృతీయ కారణంగా ఆభరణాల విక్రయాలు పెరిగే అవకాశానికి తోడు, పెళ్లిళ్లల సీజన్. దీంతో సుమారు 15 నుంచి 20 శాతం వరకు అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Jewellers expect 15-20% growth in sales this Akshaya Tritiya

ప్రస్తుతానికి పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, పసిడి ధరల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆభరణాల విక్రయాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ కౌన్సెల్ చైర్మన్ తెలిపారు.

జ్యువెల్లరీ మార్కెట్లో పెళ్లికి సంబంధించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, అదే సమయంలో పెద్ద నగలకు డిమాండ్ కొంత తగ్గిందన్నారు. నీరవ్ మోడీ కుంభకోణం బయటపడటంతో ఆభరణాల తయారీ రంగం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This year’s Akshaya Tritiya, on April 18, is expected to be the costliest ever as gold prices are likely to remain firm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X