కర్ణాటక రిజల్ట్స్ ఎఫెక్ట్: నష్టాల్లో మార్కెట్లు, అదే కారణమా?
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విషయమై స్పష్టత లేని కారణంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం కన్పించింది. బుధవారం ఉదయం నుండి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉన్న సమయంలో సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. హంగ్ ఏర్పడడంతో నష్టాలతో ముగిశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాని కారణంగా నష్టాలు కొనసాగాయి.

ఉదయం దాదాపు ఉదయం దాదాపు 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ నష్టాల్లోనే కొనసాగింది. . నిఫ్టీ కూడా 54 పాయింట్ల నష్టంతో ప్రారంభమై చివరి వరకు నష్టాలనే చవిచూసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 156.06 పాయింట్లు నష్టపోయి 35,387.88 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 60.80 పాయింట్లు నష్టపోయి 10741.10 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇవాళ ట్రేడింగ్ లో హెచ్‌యూఎల్, లుపిన్, ఐటీసీ, విప్రో, ఎస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, గెయిల్, రిలయన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.
పీఎన్‌బీ, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంచురీ ప్లేబోర్డ్స్, మోరెపెన్ ల్యాబ్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, శక్తి పంప్స్ కంపెనీల షేరు్లు దాదాపు 16శాతం పడిపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.82 వద్ద ట్రేడవుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications