నేడు నిర్మలమ్మ కీలక ప్రకటన! మారనున్న డిజిటల్ బ్యాంకింగ్ రూల్స్

కేంద్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ, పన్ను నిబంధనలను సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశ ఆర్థిక రంగానికి అత్యంత కీలకమైన 'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ - చట్ట సవరణ బిల్లు, 2026'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. కొత్త మార్పులతో రాబోతున్న ఈ బిల్లుపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

దేశంలో ఉన్న పాత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో పాటు పన్ను విధానాలను సమూలంగా మార్చేందుకు ఈ బిల్లును రూపకల్పన చేశారు. 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007', 'ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025', 'ఫైనాన్స్ యాక్ట్ 2026'లలో కీలక సవరణలు చేసేందుకు ఆర్థిక మంత్రి సభ అనుమతి కోరనున్నారు. దీనికి తోడు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా తీసుకొచ్చిన ఇన్‌కమ్ టాక్స్ ఆర్డినెన్స్ (2026)కు సంబంధించిన పూర్తి వివరాలను, దాని అవసరాన్ని వివరిస్తూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక ప్రత్యేక నివేదికను సభ ముందు ఉంచనున్నారు.

Nirmala Sitharaman to Introduce Taxation Amendment Bill 2026 Today Big Digital Banking Reforms Soon
దేశ యువతకు నిర్మలమ్మ పిలుపు: రిస్క్ తీసుకుంటేనే..
దేశ యువతకు నిర్మలమ్మ పిలుపు: రిస్క్ తీసుకుంటేనే..

గత ఖర్చులకు లోక్‌సభ ఆమోదముద్ర!

బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం, సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు గ్రాంట్ల డిమాండ్లపై విస్తృతమైన చర్చ జరగనుంది. ఆ సంవత్సరంలో అనుకున్న దానికంటే ఎక్కువగా జరిగిన వ్యయానికి పార్లమెంట్ అధికారిక ఆమోదం పొందేందుకు వీలుగా.. 'అప్రాప్రియేషన్ (నెం. 3) బిల్లు, 2026'ను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనున్నారు.

నిర్మలమ్మ వచ్చే.. రుణాలు ఇచ్చే! లబ్ధిదారులకు నేడు రూ.3,216 కోట్లు విడుదల
నిర్మలమ్మ వచ్చే.. రుణాలు ఇచ్చే! లబ్ధిదారులకు నేడు రూ.3,216 కోట్లు విడుదల

డిజిటల్ బ్యాంకింగ్‌కు కొత్త ఊపిరి..

ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగానికి తగ్గట్టుగా బ్యాంకింగ్ రికార్డుల చట్టాలను మార్చేందుకు 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు - 2026'ను కూడా లోక్‌సభ ఈరోజే పరిశీలించి ఆమోదించనుంది. మరోవైపు పారిశ్రామిక ప్రగతి, భూ వనరులు, వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి పార్లమెంటరీ కమిటీలు ఇచ్చిన సిఫార్సుల అమలు తీరుపై కేంద్ర మంత్రులు జితిన్ ప్రసాద, పెమ్మసాని చంద్రశేఖర్, భాగీరథ్ చౌదరిలు సభకు స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. దానికి తోడు రూల్ 377 కింద ప్రజా సమస్యలపై ఎంపీలు లేవనెత్తే అంశాలతో సభ హోరెత్తనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+