5 ఏళ్ళలో బ్యాంకుల్లో రూ.1 లక్ష కోట్లు ఆవిరి: ఆర్‌బిఐ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అవతకలు, మోసాల కారణంగా గత ఐదేళ్ళలో సుమారు రూ. 1 లక్ష కోట్ల మేరకు ప్రజా ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిందని ఆర్‌బిఐ అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు ఉడాయిస్తున్న ఘటనలను వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.
బ్యాంకుల్లో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్‌టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది.

ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్‌బీఐ వెల్లడించింది.
ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్‌బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications