కేంద్రం హుకుం: రుణ ఎగవేతలపై సీబీఐకి తెలపండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) తమ బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైగా తీసుకున్న రుణాల ఎగవేతకు పాల్పడిన వారి వివరాలను వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలియజేయాలని ఆయా బ్యాంకుల సీఎండీలను ఆదేశించింది. వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ జంటగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)లను దుర్వినియోగం చేసి రూ.12,700 కోట్ల మేరకు మోసగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
రొటొమాక్ గ్రూప్, సింభౌలీ షుగర్స్ సంస్థల యాజమాన్యాలు రుణాలు చెల్లించకుండా దాటవేతకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సదరు బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయం పన్నుశాఖ (ఐటీ) దర్యాప్తు చేస్తున్నాయి.
డీఆర్ఐ, ఈడీలతో రుణాల వివరాలు పంచుకోవాలని కేంద్రం ఆదేశం
ఇప్పటికే రుణ బకాయిలు సకాలంలో చెల్లించని రొటొమాక్ సీఎండీ విక్రం కొఠారీ ఆయన కొడుకునూ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులన్నీ తమ బ్యాంకుల్లో తీసుకున్న కార్పొరేట్ రుణాల్లో రూ.50 కోట్లకు పైగా ఉన్నవాటిని గుర్తించి నివేదికలు సమర్పించాలని సీబీఐ సిఫారసు చేయాలని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఈ రుణాల ఎగవేతకు పాల్పడిన వారిలో పీఎంఎలఏ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతో పంచుకోవాలని సూచించారు.

రూ.8.5 లక్షల కోట్లు దాటిన మొండి బకాయిలు
బ్యాంకు విజిలెన్స్ అధికారులు, సీబీఐ సమన్వయం చేసుకోవాలి
ప్రభుత్వ రంగ బ్యాంకులు స్థూలంగా రూ.8.5 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల భారం మోస్తున్నాయి. సరిగ్గా ప్రతిస్పందించి నిర్దేశిత మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు రాజీవ్ కుమార్ సూచించారు. సంబంధిత బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ అధికారులు.. రూ.50 కోట్లకు పైగా ఎగవేతకు పాల్పడిన వారి కేసుల దర్యాప్తు విషయమై సీబీఐతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

15 రోజుల్లో రిస్కులపై బ్లూ ప్రింట్ రూపొందించాలని బ్యాంకర్లకు ఆదేశం
వారంలో కేంద్ర ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) నుంచి రుణగ్రహీతలు, ఎగవేతదారుల జాబితా, యథాతథ స్థితిపై బ్యాంకర్లు నివేదిక పొందవచ్చునని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ బ్యాంకింగ్ లావాదేవీలు, రుణ వాయిదాల వసూళ్లలో రిస్కులేమిటన్న విషయమై నిర్ధారించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర ఆర్థిక సేవల శాఖ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఇప్పటివరకు పీఎన్బీ సాంకేతిక, నిర్వహణా రిస్కుల వల్ల రూ.12,700 కోట్లకు పెరిగిందని ప్రకటించింది. పెరుగుతున్న బ్యాంకు మొండి బకాయిల రుణాల రిస్క్‌లపై బ్లూ ప్రింట్ రూపొందించాలని కూడా బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ టెక్నాలజికల్ అధికారులు (సీటీవో)లకు సూచించారు.

-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications