బడ్జెట్ ముందే బ్రేక్ పడింది.. గంటలోనే 3 లక్షల కోట్లు గోవిందా!
భారత స్టాక్ మార్కెట్ గురువారం(జనవరి 29) భారీ పతనాన్ని చవిచూసింది. నేడు మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం గంట వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆవిరైపోవడం దలాల్ స్ట్రీట్‌లో అలజడి సృష్టించింది. ఓవైపు బడ్జెట్ 2026 కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే, మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించి 81,707 స్థాయికి పడిపోగా.. నిఫ్టీ 25,160 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
1. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు
అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. అమెరికా తనపై సైనిక చర్యకు దిగితే ఎన్నడూ లేని విధంగా సమాధానం ఇస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా రిస్క్ ఉన్నషేర్ల నుంచి ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం వంటి వాటి వైపు మళ్లుతున్నారు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందనే భయం మార్కెట్‌ను కిందకు లాగుతోంది.

2. రికార్డు కనిష్టానికి రూపాయి
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92 స్థాయికి పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిరంతరం తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. రూపాయి బలహీనపడటం అంటే దిగుమతుల భారం పెరగడమే, ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసి మరిన్ని అమ్మకాలకు దారితీసింది.
3. ముడి చమురు సెగ
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 2 శాతం పెరిగి 70 డాలర్ల మార్కుకు చేరింది. భారత్ తన చమురు అవసరాల కోసం 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇది కంపెనీల నిర్వహణ వ్యయాన్ని పెంచి, వాటి లాభాలను తగ్గిస్తుందనే ఆందోళనతో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
4. బడ్జెట్ 2026 భయాలు
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం పన్నుల విషయంలో పెద్దగా ఊరటనిచ్చే అవకాశం లేదని, వినియోగాన్ని పెంచే భారీ పథకాలపై ఆశలు తక్కువని వస్తున్న ఊహాగానాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై స్పష్టత లేకపోవడంతో, రిస్క్ తీసుకోదలుచుకోని వారు తమ లాభాలను స్వీకరించి పక్కకు తప్పుకుంటున్నారు.
5. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) గత ఏడాది జులై నుంచి నిరంతరంగా భారత షేర్లను విక్రయిస్తూనే ఉన్నారు. ఈ ఒక్క జనవరి నెలలోనే ఇప్పటివరకు రూ. 43,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన షేర్లను విక్రయించారు. విదేశీ నిధులు ఇలా వెనక్కి వెళ్లడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. దేశీయ ఇన్వెస్టర్లు కొంతవరకు ఆదుకుంటున్నప్పటికీ.. అంతర్జాతీయ ఒత్తిడి ముందు అవి సరిపోవడం లేదు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications