Strait of Hormuz: భారీ ట్రాఫిక్ జామ్.. పెరగనున్న ధరలు
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద మునుపెన్నడూ లేని విధంగా మహా 'ట్రాఫిక్ జామ్' ఏర్పడింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఆ ప్రాంతంలో భద్రతా హెచ్చరికలు జారీ చేయడం, దాడులు కొనసాగించడంతో వందలాది చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ వ్యూహాత్మక మార్గం గుండా వెళ్లే నౌకలపై భౌతిక దాడుల భయం పెరగడంతో పాటు, బీమా ఖర్చులు ఆకాశాన్ని తాకడంతో షిప్పింగ్ కంపెనీలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం రవాణా అయ్యే ఈ కీలక జలసంధి వద్ద ప్రస్తుతం దాదాపు 706 నౌకలు నిలిచిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను మోసుకెళ్లే ఈ ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 20 మిలియన్ బారెళ్ల చమురు రవాణా అయ్యే ఈ మార్గంలో, మార్చి 1వ తేదీ నాటికి ఆ సంఖ్య కేవలం 2.8 మిలియన్ బారెళ్లకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే గత సంవత్సర సగటుతో పోలిస్తే రవాణాలో దాదాపు 86 శాతం క్షీణత నమోదైంది.

Strait of Hormuz మూసివేత..
ఈ జలసంధి మూసివేతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, ఇరాన్ మీడియా మాత్రం ఈ మార్గాన్ని వాస్తవానికి మూసివేశారని పేర్కొంటోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) రేడియో సందేశాల ద్వారా అంతర్జాతీయ నౌకలను అప్రమత్తం చేస్తూ, తాము ఏ నౌకనూ అనుమతించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనితో బ్రిటన్‌కు చెందిన మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ ప్రాంతంలో భద్రతా స్థాయిని అత్యంత ప్రమాదకరమైన 'క్లిష్టమైన' (Critical) వర్గానికి పెంచి, నౌకల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సంక్షోభ ప్రభావం..
ఈ సంక్షోభ ప్రభావం ఆసియాలోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు హార్ముజ్ గుండా వచ్చే చమురుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సరఫరాలో అంతరాయం కలగడంతో కొన్ని ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్లు తమ ఉత్పత్తిని 20 నుంచి 30 శాతం తగ్గించాలని యోచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ వనరుల నుండి చమురును సేకరించడం కష్టతరమైన పని కావడంతో, త్వరలోనే మార్కెట్‌లో ముడి చమురు కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్ సరఫరాకు అంతరాయం..
భారతదేశం విషయానికొస్తే, ఈ పరిణామాల వల్ల సహజ వాయువు సరఫరాపై ఇప్పటికే ప్రభావం మొదలైంది. ఖతార్ వంటి ప్రధాన ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడంతో, దేశంలోని కంపెనీలు పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను తగ్గించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పర్యవేక్షిస్తున్నామని, సామాన్యులపై భార పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
కదనరంగంలో కాలు పెట్టిన అమెరికా మెరైన్ మెరికలు- ఇరాన్ యుద్ధం తీవ్రం -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications