మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్

ఆర్థిక భద్రత అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఉన్న దానిని తెలివిగా కాపాడుకోవడం అని ఫ్రాన్స్ నిరూపించింది. అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లాకర్లలో ఉన్న తన 129 టన్నుల బంగారాన్ని ఫ్రాన్స్ అత్యంత వ్యూహాత్మకంగా పారిస్‌కు చేర్చింది. ఈ క్రమంలో రవాణా భారం తగ్గించుకోవడమే కాకుండా, కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను మూటగట్టుకుంది.

చాలా కాలంగా ఫ్రాన్స్‌కు ఉన్న మొత్తం 2,437 టన్నుల బంగారు నిల్వల్లో 5 శాతం (129 టన్నులు) అమెరికా భద్రతలోనే ఉంది. అయితే, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం, ఆయన చేసే అస్థిరమైన ప్రకటనలు, అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న మార్పులతో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. తమ దేశ సంపద పరాయి గడ్డపై ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని భావించిన ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంక్, దానిని వెనక్కి రప్పించాలని నిర్ణయించింది.

The Great Gold Shift How France Smartly Relocated 129 Tons of Gold From New York and Earned Billions in Gains

వందల కోట్ల ఖర్చు లేకుండా.. అదిరిపోయే ప్లాన్!

సాధారణంగా వందల టన్నుల బంగారాన్ని విమానాలు లేదా ఓడల ద్వారా తరలించాలంటే భారీ భద్రత, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కోసం వందల కోట్లు ఖర్చవుతాయి. పైగా దొంగతనం లేదా ప్రమాదాల భయం ఉంటుంది. ఇక్కడే ఫ్రాన్స్ తన మేధస్సును వాడింది. న్యూయార్క్‌లో ఉన్న బంగారాన్ని అక్కడే అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించింది. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త బంగారాన్ని యూరప్ మార్కెట్లోనే కొనుగోలు చేసింది. దీనివల్ల ఫిజికల్ గా బంగారాన్ని తరలించాల్సిన అవసరం లేకుండానే, పత్రాల మార్పిడితో పని పూర్తయింది.

డబుల్ ధమాకా.. రూ.1.38 లక్షల కోట్ల ప్రాఫిట్!

ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఫ్రాన్స్‌కు రెండు రకాల ప్రయోజనాలు కలిగాయి.

  • భారీ లాభం: దశాబ్దాల క్రితం చాలా తక్కువ ధరకు కొన్న బంగారాన్ని, నేటి గరిష్ట ధరలకు అమెరికాలో అమ్మడం ద్వారా ఫ్రాన్స్‌కు 12.8 బిలియన్ యూరోలు (సుమారు ₹1,38,431 కోట్లు) లాభం వచ్చింది.
  • స్వదేశీ భద్రత: రవాణా ఖర్చులు లేకుండానే ఇప్పుడు ఫ్రాన్స్ బంగారం మొత్తం పారిస్‌లోని సురక్షిత లాకర్లలోకి చేరిపోయింది.

భారత్ కూడా అదే బాటలో..

కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాదు, మన భారతదేశం కూడా ఇదే తరహాలో 'సైలెంట్ ఆపరేషన్' చేపట్టింది. గత ఏడాది కాలంలో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఉన్న సుమారు 274 టన్నుల భారతీయ బంగారాన్ని ఆర్‌బీఐ (RBI) అత్యంత పటిష్ట భద్రతతో స్వదేశానికి తరలించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల "మన బంగారం మన దేశంలో ఉండటమే సేఫ్" అనే నినాదం ఇప్పుడు అన్ని దేశాల్లో వినిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ, రవాణా ఇబ్బందులు లేకుండా ఫ్రాన్స్ చేసిన ఈ 'గోల్డ్ ఎక్స్ఛేంజ్' ప్లాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక పాఠంలా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+