40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!

సాధారణంగా యుద్ధం వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన 'బంగారం' వైపు పరుగులు తీస్తారు. కానీ, ప్రస్తుతం ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, పసిడి ధరలు ఊహించని విధంగా పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఒక్క వారంలోనే బంగారం 11 శాతం మేర క్షీణించి, 1983 తర్వాత అత్యంత దారుణమైన వారపు నష్టాన్ని మూటగట్టుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి చూస్తే పసిడి ఏకంగా 14 శాతం విలువను కోల్పోవడం గమనార్హం.

సంక్షోభ సమయాల్లో బంగారం విలువ పెరుగుతుందనేది దశాబ్దాల కాలంగా వస్తున్న నమ్మకం. అయితే, ఈసారి 'డాలర్' పునరుత్థానం పసిడి ఆశలపై నీళ్లు చల్లింది. ఇరాన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో, ప్రపంచ కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను విరమించుకున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో బాండ్ ఈల్డ్‌లు పెరిగాయి. ఎటువంటి అదనపు ఆదాయం ఇవ్వని బంగారం కంటే, వడ్డీనిచ్చే బాండ్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం పసిడి పతనానికి ప్రధాన కారణమైంది.

Why Gold Prices Crash Bullion Records Worst Weekly Loss Since 1983 as Iran War Impacts Global Energy Markets

డాలర్ దూకుడు.. పసిడికి చేటు!

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. యుద్ధం నేపథ్యంలో అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా డాలర్‌ను ఎంచుకున్నారు. దీంతో డాలర్ ఇండెక్స్ గత కొన్ని నెలల పతనాన్ని ఆపి, 2 శాతం పైగా పుంజుకుంది. డాలర్ బలపడటంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు కిందికి దిగివచ్చాయి. గత జనవరిలో రికార్డు స్థాయిలో ట్రాయ్ ఔన్స్‌కు 5,000 డాలర్ల మార్కును తాకిన పసిడి, ఇప్పుడు 4,500 డాలర్ల దిగువకు పడిపోయి రెండేళ్ల లాభాలను ఆవిరి చేసింది.

ఇన్వెస్టర్ల వ్యూహం మారింది!

ఒకప్పుడు కేవలం సంక్షోభ నిధిగా ఉన్న బంగారం, గత కొన్ని వారాలుగా ఒక 'మీమ్ స్టాక్'లా అస్థిరంగా మారుతోంది. ఇతర ఆస్తులలో (స్టాక్ మార్కెట్ వంటివి) వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి (Cash out) చాలామంది ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారని ఆర్థిక వ్యూహకర్తలు విశ్లేషిస్తున్నారు. అప్ వార్డ్ మొమెంటం మందగించడంతో పోర్ట్‌ఫోలియోలను రీ-బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

బంగారం ధరలు ప్రస్తుతం పడిపోయినప్పటికీ, భవిష్యత్తుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే, ఏడాది చివరి నాటికి పసిడి మళ్లీ పుంజుకుని 6,000 డాలర్ల మార్కును చేరుకోవచ్చని వాల్ స్ట్రీట్ దిగ్గజం ఎడ్ యార్డెనీ అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా ప్రభుత్వం అప్పులు మరియు ద్రవ్యోల్బణ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ లక్ష్యాన్ని 5,000 డాలర్లకు తగ్గించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికైతే పసిడి వెలుగులు యుద్ధ నీడలో మసకబారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+