Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. 2026లో బంగారం ధరలు ఇంత పెరుగుతాయా?

బల్గేరియాకు చెందిన బాబా వంగా మాటలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీపావళి తర్వాత బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినా.. పెరిగిన ధరలతో పోలిస్తే తగ్గిన ధరలు చాలా తక్కువే కావడం గమనార్హం. 2025 ముగిసేందుకు ఇంకా ఎంతో కాలం లేదు. ఈ క్రమంలో 2026లో బంగారం ధరల గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవక్త బాబా వంగా చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది. 2026లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బాబా వంగా ముందే జోస్యం చెప్పారు. ఈ జోస్యం ఇప్పుడు అంతర్జాతీయ బంగారం మార్కెట్‌తో పాటు భారతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందని, దీని కారణంగా బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బంగారం ధరల పెరుగుదలకు కారణమిదే..
బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏదో ఒక రకమైన పెద్ద సంక్షోభం లేదా నగదు సంక్షోభం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. సాధారణంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో సురక్షితమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతారు. ఈ సంక్షోభం కారణంగా స్టాక్ మార్కెట్, ఇతర సాంప్రదాయ పెట్టుబడులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అలాంటి అనిశ్చితి ఉన్న సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా నిలుస్తుంది. భారీ నష్టాలు తప్పించుకోవడానికి పెట్టుబడిదారులు పసిడిని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి.. ధరల్లో ఊహించని విధంగా భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బంగారం ధరలు గణనీయంగా పెరగడం ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తోంది.

Will Gold Prices Skyrocket in 2026 Baba Vanga Prediction Goes Viral

ధరలు ఎంతవరకు పెరగవచ్చు?
ఒకవేళ బాబా వంగా జోస్యం నిజమై ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం తలెత్తితే, భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. మార్కెట్ అంచనాల ప్రకారం, బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.62 లక్షల నుంచి రూ. 1.82 లక్షల వరకు చేరవచ్చని భావిస్తున్నారు.MCX (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో బంగారం గతంలో రూ. 1,32,294 వద్ద రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. MCX గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పటివరకు 72శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం, భవిష్యత్తులోనూ పసిడిపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతోంది.

బాబా వంగా ఎవరు?
బాబా వంగా అసలు పేరు వెంజేలియా పాండేవా గుష్టిరోవా. ఆమె 1911 జనవరి 31న ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. ఆమె పుట్టుకతో అంధురాలు కాదు. 12 ఏళ్ల వయస్సులో భయంకరమైన తుఫానులో చిక్కుకోవడం వల్ల ఆమె కళ్ళు దెబ్బతిని, శాశ్వతంగా దృష్టిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని, భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారని చెబుతారు. ఆమె అంచనాలు నిజమవడం మొదలయ్యాక, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 1980ల నాటికి ఆమెను ప్రజలు 'నాస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్' అనే బిరుదుతో గౌరవించారు. ఆమె 1996లో 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+