వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న నీరవ్‌.. నేడు రొటొమాక్‌ యజమాని?.. ఆపై ఫొర్టిస్ ఈడీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం మరవుకముందే అదే తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ ముంబై శాఖలో రూ.11,400కోట్ల అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా మిలియన్‌ డాలర్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రొటొమాక్‌ పెన్నుల కంపెనీ మాతృసంస్థ భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు సమాచారం.
ఇక ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ 'ర్యాన్ బ్యాక్సీ' మాజీ సీఈఓ - ఫొర్టిస్ హెల్త్ కేర్ సహ వ్యవస్థాపకుడు మాల్వీందర్ మోహన్ సింగ్.. బ్యాంకు రుణం కోసం హామీగా పెట్టిన విలువైన ఆస్తుల విక్రయానికి చేసిన ప్రయత్నానికి ఢిల్లీ రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) అడ్డుకట్ట వేసింది.

ఇప్పటికీ రుణ వాయిదాలుగానీ, వడ్డీ గానీ చెల్లించని రుణ గ్రహీత

ఇప్పటికీ రుణ వాయిదాలుగానీ, వడ్డీ గానీ చెల్లించని రుణ గ్రహీత

రొటొమాక్‌ కంపెనీ యజమాని అయిన విక్రమ్‌ కొఠారి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులు పలు నియమాలను ఉల్లంఘించి కొఠారికి అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొఠారి యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్‌ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. ఆయన ఇప్పటివరకూ అసలును కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది.

Recommended Video

PNB scam : Rahul Gandhi Questions Modi's Silence
కొఠారి ఆస్తులు విక్రయించి రుణాలు రికవరీ చేస్తామని అలహాబాద్ బ్యాంక్

కొఠారి ఆస్తులు విక్రయించి రుణాలు రికవరీ చేస్తామని అలహాబాద్ బ్యాంక్

కాన్పూరులోని విక్రం కొఠారి కార్యాలయం కూడా గత కొన్ని వారాలుగా మూతపడి ఉంది. ఆయన కూడా కనిపించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలహాబాద్‌ బ్యాంకు మేనేజర్‌ రాకేశ్ గుప్తా స్పందిస్తూ కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పీఎన్‌బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇలా విల్ ఫుల్ డిఫాల్టర్ గా రొటోమ్యాక్ గ్లోబల్

ఇలా విల్ ఫుల్ డిఫాల్టర్ గా రొటోమ్యాక్ గ్లోబల్

కానీ తాను దేశం విడిచి పారిపోలేదని రొటోమాక్ యజమాని విక్రం కొఠారీ చెప్పారు. అలా విదేశాలకు పారిపోయినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొఠారీ చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.‘నేను కాన్పూర్‌ వాసిని.. ఇక్కడే ఉంటాను. వ్యాపార అవసరాల కోసం అవసరమైనప్పుడు విదేశాలకు వెళ్లి వస్తుంటా' అని కొఠారీ పేర్కొన్నారు. గతేడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. రొటొమ్యాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు'(విల్‌పుల్‌ డిఫాల్టర్‌)గా ప్రకటించింది.

2017 ఫిబ్రవరిలో డిఫాల్టర్ అని జారీ అయిన ఆదేశాలు

2017 ఫిబ్రవరిలో డిఫాల్టర్ అని జారీ అయిన ఆదేశాలు

తమను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌' జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆ కంపెనీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 300 కోట్లకు పైగా ఆస్తుల్ని ఇచ్చేందుకు సిద్ధమైనా రోటొమ్యాక్‌ను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌'గా తప్పుగా ప్రకటించారని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీబీ భోస్లే, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ధర్మాసనం పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు రొటొమ్యాక్‌ను విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ గతేడాది ఫిబ్రవరి 27వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి.

మాల్విందర్ మోహన్ సింగ్ యత్నాలకు రుణాల రికవరీ ట్రిబ్యునల్ చెక్

మాల్విందర్ మోహన్ సింగ్ యత్నాలకు రుణాల రికవరీ ట్రిబ్యునల్ చెక్

రుణం ఎగవేత కేసులో ఫొర్టిస్ హెల్త్ కేర్ సహా వ్యవస్థాపకుడు మాల్విందర్ మోహన్ సింగ్.. హామీగా పెట్టిన విలువైన ఆస్తుల విక్రయ ప్రయత్నాలను ఢిల్లీ రుణాల రికవరీ ట్రిబ్యునల్ అడ్డుకున్నది. ‘యెస్ బ్యాంక్'లో ఆస్కార్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ అనే సంస్థ తీసుకున్న రూ.569.64 కోట్ల రుణానికి మాల్విందర్ మోహన్ సింగ్ ఢిల్లీలోని లుట్యెన్స్, ఇతర విలాసవంతమైన ఆస్తులను హామీగా పెట్టారు. కానీ ఈ రుణం ఇంకా చెల్లించనే లేదు. కానీ ఈ ఆస్తుల విక్రయానికి మాత్రం మాల్విందర్ మోహన్ సింగ్ ప్రయత్నాలు చేపట్టారు.

చర, స్థిరాస్తుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని డీఆర్టీ ఆదేశం

చర, స్థిరాస్తుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని డీఆర్టీ ఆదేశం

దీంతో మాల్విందర్ మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా ‘యెస్ బ్యాంక్' ఢిల్లీలోని రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. దీన్ని ప్రిసైడింగ్ అధికారి జీవీకే రాజు సారథ్యంలోని డీఆర్టీ బెంచ్ విచారించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఢిల్లీలోని రాజేశ్ పైలట్ మార్గ్, 1 అనే చిరునామాలో గల చిరాస్థులను విక్రయించొద్దని ఆదేశించింది. రుణ గ్రహీత ఉద్దేశ పూర్వకంగా రుణ ఎగవేతకు ప్రయత్నిస్తున్నాడని ‘యెస్' బ్యాంక్ తన పిటిషన్‌లో పేర్కొన్నది. దీంతో సదరు మాల్విందర్ మోహన్ సింగ్‌ను ఆయన చర, స్థిరాస్థుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని డీఆర్టీ ట్రిబ్యునల్ ఆదేశించింది. గమ్మత్తేమిటంటే ఏడాది క్రితం ఫొర్టిస్ హెల్త్ కేర్ పాలక మండలి ఆమోదం లేకుండానే డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మాల్విందర్ మోహన్ సింగ్ సోదరులను ఈ నెల 26న అఫిడవిట్ సమర్పించాలని సెబీ ఆదేశించడం ఆసక్తికర పరిణామం.

English summary
New Delhi:After billionaire diamantaire Nirav Modi, another defaulter Vikram Kothari, the promoter of Rotomac Pen, has also allegedly gone abroad after swindling Rs. 800 crore from various public sector banks including Allahabad Bank, Bank of India and Union Bank of India, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X