Sketch: పట్టపగలు పక్కన స్టాఫ్, ఎదురుగా బంగారు నగలు, ఆంటీల స్కెచ్ కు సూపర్ సినిమా!

చెన్నై/ బెంగళూరు: కొందరు ఏమి చేసినా మూడో కంటికి తెలీకుండా చెయ్యడంతో వాళ్లు కేటుగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు అదేకోవకు చెందిన ఇద్దరు ఆంటీల కోసం మామలు వేట మొదలుపెట్టారు. ప్రముఖ నగరంలో, నిత్యం రద్దీగా ఉండే జ్యువెలరీ షోరూమ్ లో పట్టపగలు పక్కనే ఉన్న సిబ్బందికి గులాబ్ జామున్ తినిపించిన ఇద్దరు ఆంటీలు గుట్టుచప్పుడు కాకుండా సినిమా స్కెచ్ తో 12 బంగారు గొలుసులో లూటీ చేసి సైలెంట్ గా దర్జాగా షోరూమ్ నుంచి బయటకు చెక్కేశారు.

రాత్రి అన్ని సర్దుకుంటున్న జ్యువెలరీషాప్ సిబ్బంది ఇద్దరు ఆంటీలు బంగారు గొలుసులు నొక్కేశారని గుర్తించి లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు.

 ఫేమస్ జ్యువెలరీ షోరూమ్

ఫేమస్ జ్యువెలరీ షోరూమ్

తమిళనాడులో బంగారం ఏ రేంజ్ లో కొనుగోలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ ప్రజలు ఎక్కువా ఇష్టపడే వాటిలో బంగారం మొదటి వరుసలో ఉంటుంది. తమిళనాడులో ఎంతటి పేదవాళ్లైనా కనీసం వారి దగ్గర కొంతైన బంగారం ఉంటుంది. చెన్నై సిటీలోని అంబత్తూరులోని పడిలో ప్రముఖ శరవణ స్టోర్స్ ( బంగారు షో రూమ్) నిర్వహిస్తున్నారు.

కిటకిటలాడే షోరూమ్

కిటకిటలాడే షోరూమ్

చెన్నై సిటీలోని అంబత్తూరులో ప్రముఖ శరవణ స్టోర్స్ నిత్యం బంగారు నగలు కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతోంది. అలాంటి షోరూమ్ లోకి నిత్యం మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యుల వెళ్లి వారికి కావలసిన, నచ్చిన బంగారు నగలు కొనుగోలు చేసి వెలుతుంటారు. ఇలాంటి శరవణ స్టోర్స్ లోకి ఇద్దరు కిలాడీ మహిళలు బంగారు అభరణాలు చూడటానికి వెళ్లారు.

చిటికెలో గులాబ్ జామున్..... రెప్పపాటులో మాయం

చిటికెలో గులాబ్ జామున్..... రెప్పపాటులో మాయం

ఇద్దరు మహిళలు జ్యువెలరీ షోరూమ్ లో మాకు ఆ నగలు చూపించండి, ఈ నగలు చూపించండి అంటూ అక్కడ సిబ్బందికి చెప్పి హడావిడి చేశారు. సిబ్బంది బంగారు నగలు చాలా వరకు చూపించారు. బంగారు నగలు చూసిన ఇద్దరు ఆంటీలు అబ్బే మాకు ఈ నగలు నచ్చలేదని, తరువాత వస్తామని చెప్పి అక్కడ చేతికి చిక్కిన కొన్ని బంగారు గొలుసులు చెక్కేసి అక్కడ ఉన్న సిబ్బందికి గులాబ్ జామున్ తినిపించి అక్కడి నుంచి చిన్నగా సైలెంట్ గా జారుకున్నారు.

రాత్రి ఉద్యోగులకు షాక్

రాత్రి ఉద్యోగులకు షాక్

రాత్రి ఎప్పటిలాగే శరవణ స్టోర్స్ మూసివేసిన తరువాత నగలు షోరూమ్ లోని సిబ్బంది బంగారు గొలుసులు ఉన్న బాక్స్ లు అన్ని సర్దుతున్న సమయంలో వారి దిమ్మతిరిగిపోయింది. ఖరీదైన 12 బంగారు గొలుసులు కనపడటం లేదని గుర్తించిన సిబ్బంది అక్కడే ఉన్న షోరూమ్ మేనేజర్ కు విషయం చెప్పి లబోదిబో అన్నారు.

ఇద్దరు ఆంటీల చేతివాటం

ఇద్దరు ఆంటీల చేతివాటం

విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శరవణ స్టోర్స్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో మంచి సిల్క్ చీరలు కట్టుకుని ముఖాలకు మాస్క్ లు వేసుకుని వచ్చిన ఇద్దరు కిలాడీ లేడీలు 12 బంగారు గొలుసులు లూటీ చేశారని పోలీసులు గుర్తించారు.

పట్టపగలు ఏం స్కెచ్ వేశారు?

పట్టపగలు ఏం స్కెచ్ వేశారు?

షోరూమ్ లోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా ఇద్దరు మహిళల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. పట్టపగలు చిన్నచిన్న బంగారు నగల షాపుల్లో ఇలాంటి చోరీలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ప్రముఖ శరవణ స్టోర్స్ లో ఏకంగా 12 బంగారు గొలుసులు మాయం కావడంతో చెన్నై సిటీ పోలీసులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+