Aunty: పుట్టింటిలో భార్య మకాం, సహనం కోల్పోయిన భర్త, రెచ్చిపోయిన అత్తను స్పాట్ లో చంపేసి, భార్యను!

చెన్నై/మదురై: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను అతను పెళ్లి చేసుకున్నాడు. భార్యతో జీవితాంతం కలిసి జీవించాలని భర్త అనుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న సమయంలో భర్త ఒకటి అనుకుంటే తరువాత ఒకటి జరిగింది. పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాకుండానే దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేస్తే ఒకటి రెండు రోజులు కలిసి ఉంటున్న దంపతులు తరువాత మళ్లీ మొదటికే వచ్చి గొడవలు పడుతున్నారు. పెద్దలు కూడా పంచాయితీలు చెయ్యలేక చేతులు ఎత్తేశారు.

చివరికి భార్య ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తను వదిలేసిన భార్య పుట్టింటిలోనే చాలాకాలం నుంచి ఉండిపోయింది. ఇన్ని రోజులు తన భార్య తిరిగి ఇంటికి వస్తుందని భర్త ఎదురు చూశాడు. అయితే భార్య మాత్రం భర్త వైపు కన్నెత్తికూడా చూడలేదు. భార్య మీద ఆవేశంతో ఊగిపోయిన భర్త నేరుగా ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడ భార్య, అత్తతో అతను గొడవపడ్డాడు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు. ఆ సమయంలో కత్తి తీసుకున్న అతను అతని భార్య, అత్తను దారుణంగా పొడిచేశాడు. అల్లుడు ఆవేశంగా, బలంగా పొడవడంతో అత్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

తమిళనాడులోని మదురై సిటీ సమీపంలోని నెడుమదురై ప్రాంతంలో మునియపాండి అలియాస్ పాండి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన జియా (30) అనే మహిళను పాండి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునే సమయంలో పాండి, జియా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.

భర్త ఏదో అనుకుంటే ఏదో జరిగింది

భర్త ఏదో అనుకుంటే ఏదో జరిగింది

భార్య జియాతో జీవితాంతం కలిసి జీవించాలని ఆమె భర్త పాండి అనుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న సమయంలో పాండి ఒకటి అనుకుంటే తరువాత ఒకటి జరిగింది. పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాకుండానే పాండి, జియా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కాపురంలో ఇలాంటి గొడవలు మామూలే అంటూ బంధువులు కూడా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.

 పుట్టింటికి చెక్కేసిన భార్య

పుట్టింటికి చెక్కేసిన భార్య

పెద్దలు పంచాయితీలు చేస్తే ఒకటి రెండు రోజులు కలిసి ఉంటున్న జియా, పాండి దంపతులు తరువాత మళ్లీ మొదటికే వచ్చి గొడవలు పడుతున్నారు. పెద్దలు కూడా పంచాయితీలు చెయ్యలేక చేతులు ఎత్తేశారు. చివరికి జియా ఆమె భర్త పాండితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పాండిని వదిలేసిన అతని భార్య జియా ఆమె పుట్టింటిలోనే చాలాకాలం నుంచి ఉండిపోయింది.

ఆవేశంతో ఊగిపోయిన అత్తా, అల్లుడు

ఆవేశంతో ఊగిపోయిన అత్తా, అల్లుడు

ఇన్ని రోజులు తన భార్య జియా తిరిగి తన ఇంటికి వస్తుందని ఆమె భర్త పాండి ఎదురు చూశాడు. అయితే భార్య జియా మాత్రం ఆమె భర్త పాండి వైపు కన్నెత్తికూడా చూడలేదు. భార్య జియా మీద ఆవేశంతో ఊగిపోయిన పాండి నేరుగా ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ భార్య జియా, అతని అత్త కాళియమ్మాల్ (49)తో పాండి గొడవపడ్డాడు. అత్తా కాళియమ్మాల్, అల్లుడు పాండి ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూఊగిపోయారు.

అత్తను పొడిచి చంపేసిన అల్లుడు... భార్య జస్ట్ మిస్

అత్తను పొడిచి చంపేసిన అల్లుడు... భార్య జస్ట్ మిస్

నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ పాండి, అతని అత్త కాళియమ్మాల్ ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు. ఆ సమయంలో కత్తి తీసుకున్న పాండి అతని భార్య జియా, అత్త కాళియమ్మాల్ ను దారుణంగా పొడిచేశాడు. అల్లుడు పాండి ఆవేశంగా, బలంగా పొడవడంతో అత్త కాళియమ్మాల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పాండి భార్య జియా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మదురైలోని ఆసుపత్రికి తరలించారు. భార్య జియా కాపురానికి రాలేదని రగిలిపోయిన పాండి కత్తిపోట్లకు అతని అత్త కాళియమ్మాల్ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+