చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Aunty: అత్తను చంపిన కోడలు, 14 సార్లు కత్తితో పొడిచి, వంటింట్లో నిప్పంటించి లేపేసింది, మ్యాటర్ తెలిసి షాక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యువతి, యువకుడి పరిచయం స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. ఒకే మతానికి చెందిన ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అమ్మాయి మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం, అబ్బాయి శ్రీమంతుల కుటుంబానికి చెందిన వారు కావడంతో అక్కడ తేడా వచ్చింది. వివాహం చేసుకున్న తరువాత భార్యను ఆమె భర్త చాలా సంతోషంగా చూసుకున్నాడు. అయితే ఇంట్లో అత్తా కోడలికి గొడవలు మొదలైనాయి.

చాలా కాలం ఇద్దరి మద్య కోల్డ్ వార్ జరిగింది. రానురాను మగాళ్లకు తెలీకుండా అత్తా కోడలు కొట్టుకున్నారని తెలిసింది. తరువాత అత్త వంటిట్లో మంటల్లో కాలిపోయి శవమై కనిపించింది. ఆ సమయంలో ఇంట్లో కోడలు కూడా ఉంది. పోస్టుమార్టం నివేదికలో అత్తను 14 సార్లు కత్తితో పొడిచి చంపేసిన తరువాత నిప్పంటిచారని వెలుగు చూడటంతో అసలు కథ మొదలైయ్యింది.

Illegal affair: కూతురుకు పెళ్లి చేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆంటీ స్కెచ్, కూతురి బిడ్డను!Illegal affair: కూతురుకు పెళ్లి చేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆంటీ స్కెచ్, కూతురి బిడ్డను!

కాలేజ్ ఫ్రెండ్స్

కాలేజ్ ఫ్రెండ్స్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని తరనల్లూరులోని విశ్వాస్ నగర్ లో ఇబ్రహీం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇబ్రహీం, నవీనా (46) దంపతులకు అజీమ్ ఖాన్ (28) అనే కుమారుడు ఉన్నాడు. అజీమ్ ఖాన్ చెన్నైలోని ప్రైవేట్ కాలేజ్ లో చదివే సమయంలో రేష్మా (27) అనే యువతి పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

అజీమ్ ఖాన్, రేష్మాల పరిచయం స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. కాలేజ్ చదువు పూర్తి అయ్యే వరకు అజీమ్ ఖాన్, రేష్మా పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. రెండు కుటుంబాలకు దూరంగా చెన్నైలో ఉంటున్న అజీమ్ ఖాన్, రేష్మాలు చాలా సంతోషంగా గడిపారు. ఒకే మతానికి చెందిన అజీమ్ ఖాన్, రేష్మా వివాహం చేసుకోవాలని అనుకోవడంతో రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఆస్తులు, అంతస్తుల్లో తేడా

ఆస్తులు, అంతస్తుల్లో తేడా

వివాహం చేసుకున్న అజీమ్ ఖాన్, రేష్మా దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. రేష్మా మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం, అజీమ్ ఖాన్ శ్రీమంతుల కుటుంబానికి చెందిన వారు కావడంతో అక్కడ రెండు కుటుంబాల పెద్దల్లో తేడా వచ్చింది. వివాహం చేసుకున్న తరువాత భార్య రేష్మాను ఆమె భర్త అజీమ్ ఖాన్ చాలా సంతోషంగా చూసుకున్నాడు.

అత్తా కోడలు కోల్డ్ వార్

అత్తా కోడలు కోల్డ్ వార్

అజీమ్ ఖాన్ విరుధాచలంలో సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు. అజీమ్ ఖాన్ విరుధాచలంలో ఉండటంతో అతని భార్య రేష్మా అత్తమామల దగ్గర తిరుచ్చిలోని ఇంట్లోనే ఉంటున్నది. ఇంట్లోనే ఉంటున్న అత్తా నవీనా, ఆమె కోడలు రేష్మాల మధ్య రానురాను చిన్నచిన్న గొడవలు మొదలైనాయని వెలుగు చూసింది.

ఇంట్లో మగాళ్లకు తెలీకుండా కొట్టుకుంటున్న అత్తాకోడలు

ఇంట్లో మగాళ్లకు తెలీకుండా కొట్టుకుంటున్న అత్తాకోడలు

చాలా కాలం నవీనా, రేష్మాల మద్య కోల్డ్ వార్ జరిగింది. రానురాను ఇంట్లో మగాళ్లకు తెలీకుండా అత్తా నవీనా, ఆమె కోడలు రేష్మా కొట్టుకున్నారని తెలిసింది. అయితే అత్త నవీనా ఆమె భర్త ఇబ్రహీంకు కాని, కోడలు రేష్మా ఆమె భర్త అజీమ్ ఖాన్ కు కాని ఏ విషయాలు చెప్పకుండా సైలెంట్ గా ఇంతకాలం గడిపేశారని తెలిసింది.

అత్తను కత్తితో దారుణంగా పొడిచి చంపేసిన కోడలు

అత్తను కత్తితో దారుణంగా పొడిచి చంపేసిన కోడలు

అజీమ్ ఖాన్ విరుధాచలం వెళ్లిపోయిన ఇతరువాత ఊర్లో ఉన్న రైస్ మిల్లు చూసుకోవడానికి అతని తండ్రి ఇబ్రహీం వెళ్లాడు. తరువాత ఇంట్లో వంట గదిలో ఉన్న అత్త నవీనా, కోడలు రేష్మాల మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నవీనా ఆమె కోడలు రేష్మాను చితకబాదిందని తెలిసింది. ఆ టైమ్ లో రెచ్చిపోయిన రేష్మా వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని ఆమె అత్త నవీనాను ఇష్టం వచ్చినట్లు పొడిచేయడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

14 కత్తిపోట్లు..... నిప్పంటించిన కోడలు

14 కత్తిపోట్లు..... నిప్పంటించిన కోడలు

అత్త నవీనాను దారుణంగా చంపేసిన రేష్మా ఆమె శవం మీద కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే పోస్టుమార్టం నివేదికలో నవీనా శరీరం మీద 14 కత్తిపోట్లు పడ్డాయని, ఆమెను చంపేసిన తరువాత శవం మీద కిరోసిన్ పోసి నిప్పంటించారని వెలుగు చూసింది.

మ్యాటర్ మొత్తం చెప్పిన కోడలు

మ్యాటర్ మొత్తం చెప్పిన కోడలు

పోలీసులు నవీనా కోడలు రేష్మాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమయంలో రేష్మా మ్యాటర్ మొత్తం చెప్పింది. మాకు డబ్బు లేదని పెళ్లి జరిగినప్పటి నుంచి మా అత్త నవీనా తనను చులకనగా చూసిందని, రెండు సార్లు అబార్షన్ చేయించిందని, మూడోసారి తనకు బిడ్డపుట్టాడని, తనను, తన భర్త అజీమ్ ను విడదీయడానికి మా అత్త నవీనా చాలాసార్లు ప్రయత్నించిందని రేష్మా పోలీసులకు చెప్పింది.

తన మీద దాడి చేసి తనను చంపడానికి ప్రయత్నించిన సమయంలోనే మా అత్త నవీనాను తానే చంపేశానని రేష్మా అంగీకరించిందని తిరుచ్చి పోలీసులు అన్నారు. అత్తను ఆమె కోడలు దారుణంగా హత్య చేసిన సంఘటన తిరుచ్చిలో కలకలం రేపింది.

English summary
Aunty: Daughter in law killed mother in law due to family issue in Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X