Bigg Boss Tamil:కమల్ "కిస్"తో షాకయ్యాను..కంటెస్టెంట్ చెప్పిన ముద్దు కహానీ..!
చెన్నై: ప్రస్తుతం బిగ్‌బాస్ పలు భాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరుగొంటోంది. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్‌లు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో అక్టోబర్ 6వ తేదీన బిగ్‌బాస్ ప్రారంభమైంది. ఇక ఆ సమయంలో ఒక కంటెస్టెంట్‌కు కమల్‌హాసన్‌కు మధ్య ఓ చిన్నపాటి సంభాషణ జరిగింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు.. ఏమిటా సంభాషణ..?

పాత జ్ఞాపకాలు
తమిళంలో బిగ్‌బాస్ షో అక్టోబర్ 6న ప్రారంభమైంది. చాలా గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళం బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌గా అప్పటి తరం హీరోయిన్ రేఖ ఉన్నారు. రేఖ కూడా కమల్‌హాసన్‌తో కలిసి అప్పట్లో నటించారు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ కాకముందు రేఖ కమల్‌తో తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. కమల్ హాసన్ హీరోగా రేఖ హీరోయిన్‌గా 1986లో పున్నాగై మన్నన్ అనే చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇందులో ఓ సన్నివేశం చాలా వివాదాస్పదంగా మారింది. అప్పట్లో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

నా అనుమతి లేకుండానే...
పున్నాగై మన్నన్ చిత్రంలో కమల్‌హాసన్ మరియు రేఖ ఓ కొండ పై నుంచి దూకే సన్నివేశంను చిత్రీకరించారు. ఈ సన్నివేశమే అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. వీరు కొండపై నుంచి దూకే ముందు కమల్ హాసన్ రేఖకు ఓ ముద్దు పెడతాడు. ఈ ముద్దే వివాదానికి తెరదీసింది. అసలు ముద్దు సన్నివేశం గురించి తనకు ముందుగా చెప్పలేదని రేఖ చెప్పుకొచ్చారు. తన అనుమతి లేకుండానే కమల్ హాసన్ ఘాటు ముద్దు ఇచ్చారని రేఖ సంచలన కామెంట్స్ చేసింది. ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు ముద్దు పెడితే ఎలాగుంటుంది అని ప్రశ్నించింది రేఖ. ముందుగానే ముద్దు గురించి చెప్పి ఉంటే తాను ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునే దాన్ని కాదని కుండబద్దలు కొట్టింది రేఖ.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీన్
ఇక బిగ్‌బాస్‌లో రేఖ ఎంటర్ అవుతున్నారన్న వార్త ఈ ఏడాది ప్రారంభంలో లీక్ కాగానే ఆమెకు కమల్‌కు మధ్య జరిగిన ఈ ముద్దు సీన్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. వైరల్ కావడంతో చాలామంది దీని వెనక కథను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొన్నేళ్ల కిందట జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఎందుకవుతోందో అర్థం కావడం లేదంటూ అమాయకంగా చెప్పేసింది రేఖ. తన అనుమతి లేకుండా చేసిన ఈ సన్నివేశం సినిమా పరంగా వర్కౌట్ అయ్యిందని చెప్పారు రేఖ. ఇప్పుడు ఆ ముద్దు సన్నివేశం గురించి తద్వారా ఏదో లబ్ది పొందాలన్న ఉద్దేశం తనకు లేదని అందుకే దాని గురించి మాట్లాడబోనని స్పష్టం చేసింది. తన చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్‌లు ఉన్నాయని వాటిమీదే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
మొత్తానికి 1986 నవంబర్ 1న విడుదలైన పున్నాగై మన్నన్ చిత్రం సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్, రేఖలతో పాటుగా రేవతి కూడా మరో లీడ్ రోల్ ఇందులో పోషించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications