Viral Video: బైకులతో ప్రమాదకర స్టంట్లు.. వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారంటే..
కొందరు చేసే పని వారి కుటుంబాలను విషాదంలో ముంచుతుంది. ముఖ్యంగా యువత చేసే కొన్ని పనులు వారిని ప్రమాదంలోకి నెడతాయి. తాజాగా కొంత మంది చేసిన బైక్ స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా బైక్ స్టంట్లు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

బినోస్..
ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన బినోస్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
శుక్రవారం ద్రవిడ మున్నేట్ర కజహగం (DMK) ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న చెన్నైలోని టేనాంపేట్ రహదారిపై బైకర్ల ముఠా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియోల ఆధారంగా..
బైక్ గ్యాంగ్ విన్యాసాలు చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయడం ద్వారా ఈ ముఠాపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరారు. వీడియోల ఆధారంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఎవరంటే..
అరెస్టయిన వారిని రాయపేటకు చెందిన పెట్రోల్ మాలిక్, సెంబియంకు చెందిన ఇమ్రాన్ ఖాన్, ముఖేష్, తిరుపత్తూరుకు చెందిన మహ్మద్ హరీస్,మహ్మద్ సైఫాన్‌లుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన బినోస్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.












Click it and Unblock the Notifications